Last Updated:

Telangana Assembly : అసెంబ్లీ నుంచి జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్.. స్పీకర్‌ సంచలన నిర్ణయం

Telangana Assembly : అసెంబ్లీ నుంచి జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్.. స్పీకర్‌ సంచలన నిర్ణయం

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘర్షణాకర పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తాము ఎన్నుకుంటేనే మీరు స్పీకర్ అయ్యారని, సభ మీ సొంత కాదని జగదీశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జగదీశ్ వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యులు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. సభ గౌరవాన్ని దిగజార్చేలా మాట్లాడిన జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ భద్రతా అధికారులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే మార్షల్స్‌ను భారీగా మోహరించారు. సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. సభలో క్రమశిక్షణను కాపాడేందుకు స్పీకర్ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది.

సభలో జరిగిన చర్చ అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ జగదీశ్‌రెడ్డిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ నిర్ణయంతో అసెంబ్లీలో ఉత్కంఠ నెలకొన్నప్పటికీ సభ్యులు తదుపరి ఎజెండాపై చర్చను కొనసాగించారు. సభలోని నిబంధనలను ఉల్లంఘన, అసెంబ్లీ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు జగదీశ్‌ని బడ్జెట్ సమావేశాల వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటన చేశారు.

మరోవైపు జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ చేయడంతో సభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. తర్వాత సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి: