Home / Assembly
CM Revanth Reddy Full Speech in Assembly: లోక్‌సభ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు వాడీవేడిగా జరిగాయి. ఈ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. బల్లులు, పురుగులు తిరిగే రూంలో ట్యూబులైట్లు వేసేలా చేశారని, దీంతో 16 రోజులు నిద్రపోలేదని చెప్పారు. ఉదయం చెట్టు కింద నిద్ర పోయేవాడినని, అయినా నేను ఏనాడూ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. […]
KTR : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు వాడివేడీగా కొనసాగాయి. అవయవదానం బిల్లును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. అవయవదానం బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా జీవన్‌దాన్ ద్వారా 3,724 మంది బాధితులు ఆర్గాన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. […]
Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు స్పీకర్ గడ్డప్రసాద్ కుమార్ అనుమతితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం సభలో మాట్లాడారు. డీలిమిటేషన్‌పై రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకపోవడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పునర్విభజనతో జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని కోరారు. ప్రస్తుత జనాభాను ప్రాతిపదికగా […]
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడీగా కొనసాగుతున్నాయి. ఈ రోజు శాసన సభలో సభ్యులు ప్రాజెక్టుల గురించి అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌పై కీలక ప్రకటన చేశారు. 8 మృతదేహాలకు ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. మిగతా మృతదేహాలను బయటకు తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సభ దృష్టి తీసుకొచ్చారు. డీ-1, డీ-2 ప్రదేశాల్లో […]
Telangana Assembly : అసెంబ్లీలో ఇవాళ మధ్యాహ్నం ఆసక్తికర చర్చ జరిగింది. రైతు సమస్యలు, రైతు రుణమాఫీ, వడ్ల బోనస్‌పై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తమ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు.. నియోజకవర్గంలో తాను తిరిగినట్లు తిరగలేవని చెప్పారు. ప్రజలకు ఎక్కువ కాలం ఎవరు అందుబాటులో ఉంటారో తేల్చుకుందామా? అని కౌంటర్ ఇచ్చారు. సన్నవడ్లకు […]
Bhatti Vikramarka : గత బీఆర్ఎస్ సర్కారు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా అప్పులు తెచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు మొత్తం రూ.16.70లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఆ మొత్తంతో ఏం నిర్మించారని ప్రశ్నించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.16.70లక్షల కోట్లతో నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్పీ, ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్టు నిర్మించారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరానికి […]
Harish Rao : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మార్పు పేరుతో అనేక వాగ్దానాలు ఇచ్చారని, గెలిచిన తర్వాత హామీలను నెరవేర్చడం మార్చిపోయారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని, ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై ఇవాళ జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నీతులు చెప్పారని దుయ్యబట్టారు. గతేడాది బడ్జెట్‌తో […]
Komatireddy Venkat Reddy : గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇవాళ శాసనసభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు 40 శాతం ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. 6 నెలలు లేదా 3 నెలలకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రతి పల్లె నుంచి మండల కేంద్రానికి డబుల్ రహదారులు వేయిస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కు మాత్రమే రోడ్లు వేశారని […]
Yadagirigutta : దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై మంగళవారం తెలంగాణ శాసన సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఆలయ పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. 18 మంది సభ్యులతో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభ్యుల పదవీ కాలం రెండేళ్లుగా కొనసాగుతారని పేర్కొన్నారు. బోర్డు చైర్మన్‌కు, సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని, డీఏలు మాత్రం ఉంటాయన్నారు. ఆలయ […]
Revanth Reddy : బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమెదం తెలిపింది. దీంతో బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన సందర్భంగా మంగళవారం అసెంబ్లీలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సీఎం రేవంత్ బీసీ సంఘాల నేతలతో మాట్లాడారు. ఈ అభినందనలు తనకు కాదని, రాహుల్ గాంధీకి అందాలన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన […]