Last Updated:

Lok Sabha Secretariat: బీఏసీ నుంచి టీఆర్ఎస్ ను తొలగించిన లోక్ సభ సచివాలయం

టీఆర్ఎస్ కు లోక్ సభలో 9 మంది సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీ నుంచి లోక్ సభ సచివాలయం తొలగించింది. ఇకపై ఆహ్వానిత పార్టీగానే టీఆర్ఎస్ కొనసాగనుంది.

Lok Sabha Secretariat: బీఏసీ నుంచి టీఆర్ఎస్ ను తొలగించిన లోక్ సభ సచివాలయం

Lok Sabha Secretariat: టీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ సచివాలయం షాక్ ఇచ్చింది. లోక్ సభ బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) నుంచి టీఆర్ఎస్ ను తొలగించింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినా లోక్ సభ సచివాలయం గుర్తింపు ఇవ్వలేదు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ తరపున నామా నాగేశ్వరరావు బీఏసీ సభ్యుడిగా ఉన్నారు. బుధవారం జరగనున్న బీఏసీ భేటీకి నామాను
ఆహ్వానితుడిగానే ఆహ్యానం అందింది.

 

ఇకపై ఆహ్వానిత పార్టీగానే టీఆర్ఎస్(Lok Sabha Secretariat)

ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఏసీ సభ్వత్వం ఇస్తారు. అయితే టీఆర్ఎస్ కు లోక్ సభలో 9 మంది సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీ నుంచి లోక్ సభ సచివాలయం తొలగించింది.

ఇకపై ఆహ్వానిత పార్టీగానే టీఆర్ఎస్ కొనసాగనుంది. దీంతో బీఏసీ ఆహ్వానిస్తేనే టీఆర్ఎస్ బీఏసీ భేటికి హాజరుకావాల్సి ఉంటుంది.

ఈ రోజు జరుగుతున్న బీఏసీకి నామాని ఆహ్వానిస్తూ లోక్‌సభ సచివాలయం సమాచారం ఇచ్చింది.

మంత్రిత్వ శాఖల వారీగా డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై చర్చ సందర్భంగా బీఏసీ సమావేశం ఉన్నట్లు లోకసభ సచివాలయం ఆహ్వానంలో తెలిపింది.

బీఏసీ సమావేశ సమాచారంలో అసలు విషయం బయటపడింది.

 

బీఆర్‌ఎస్‌గా మారి 3 నెలలు

గత ఏడాది అక్టోబర్‌ 5న టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ గా పేరు మార్చుకుంది. ఈ పేరు మార్పుపై ఈసీకి టీఆర్‌ఎస్‌ లేఖ కూడా రాసింది.

ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ ఈసీ ఆమోదం తెలిపింది. అనంతరం గత ఏడాది డిసెంబర్ 9న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

దీంతో దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు.

టీఆర్ఎస్ ఎల్పీని.. బీఆర్ఎస్ ఎల్పీ గా కూడా మార్చారు. టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్‌గా మారి దాదాపు 3 నెలలు అవుతున్నా కూడా లోక్‌సభ సచివాలయం మాత్రం నేటికీ ఆ పార్టీకి గుర్తింపు ఇవ్వలేదు.

 

జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ దృష్టి

ఎన్నో అవమానాలు.. ఉద్యమాలు.. జైలు ఆమరణ దీక్షతో 21 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఒక్కో అడుగు వేసుకుంటూ.. ఈ స్థాయికి చేరుకుంది.

స్వరాష్ట్రాన్ని సాధించేందుకు ఎన్నో పోరాటాలు చేసి… చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది.

హుస్సెన్ సాగర్ ఒడ్డున 2001 ఏప్రిల్ 27 వ తేదీన అతి తక్కువ మంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకుంది.

అలా మెుదలైన పార్టీ.. స్వరాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ తర్వాత 13 ఏళ్ల పోరాటంతో 2014 లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది.

ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టింది.

ఇప్పుడు జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు కేసీఆర్ బీఆర్ఎస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున, జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది.