Last Updated:

Minister Puvvada Ajay Kumar: మంత్రి పువ్వాడ అజయ్ ఇంటి నెంబరుతో 530 ఓట్లు..

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు చెందినఒకే ఇంటి నంబర్‌ పై 532 ఓట్లు నమోదయ్యాయి. ఆర్టీఐ చట్టం కింద ఖమ్మం కలెక్టరేట్ నుంచి కార్యకర్త కొయ్యిని వెంకన్న ఈ మేరకు వివరాలు సేకరించారు. మమత హాస్పిటల్ రోడ్డులోని గొల్లగూడెం ఏరియాలో 5-7-200 నంబర్ వున్న ఇంట్లో ఈ ఓట్లు నమోదయ్యాయి. Over 530 voters listed on minister Ajay Kumar's house number.

Minister Puvvada Ajay Kumar: మంత్రి పువ్వాడ అజయ్ ఇంటి నెంబరుతో 530 ఓట్లు..

Khammam: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు చెందినఒకే ఇంటి నంబర్‌ పై 532 ఓట్లు నమోదయ్యాయి. ఆర్టీఐ చట్టం కింద ఖమ్మం కలెక్టరేట్ నుంచి కార్యకర్త కొయ్యిని వెంకన్న ఈ మేరకు వివరాలు సేకరించారు. మమత హాస్పిటల్ రోడ్డులోని గొల్లగూడెం ఏరియాలో 5-7-200 నంబర్ వున్న ఇంట్లో ఈ ఓట్లు నమోదయ్యాయి.

దక్కన్ క్రానికల్ కథనం మేరకు పువ్వాడ అజయ్‌కుమార్‌, ఆయన భార్య పువ్వాడ వసంతలక్ష్మి, పువ్వాడ నయన్‌రాజ్‌ల ఓట్లు ఒకే ఇంటి నంబర్‌లో నమోదయ్యాయి. 2014లో ఇదే ఇంటి నంబర్‌పై 453 ఓట్లు, 2018లో 657 ఓట్లు, 2019లో 561 ఓట్లు, 2021లో 532 ఓట్లు వచ్చాయి. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ, మునిసిపల్ కార్పొరేషన్‌ల ఎన్నికలకు ముందు ఈ గణాంకాలను మార్చేవారు

మంత్రికి చెందిన మమత మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న చాలా గెస్ట్ హౌస్‌లు, హాస్టళ్లలో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. 5-7-200/10 నెంబరు గల గెస్ట్ హౌస్‌కి కిన్నెరసాని, కృష్ణా, గోదావరి మొదలైన పేర్లున్నాయి. ఎన్నికల సంఘం స్వతంత్ర విచారణ జరిపితే ఓటు కుంభకోణం బయటపడుతుందని వెంకన్న అంటున్నారు.

ఇవి కూడా చదవండి: