Last Updated:

Gangula Kamalakar మాతో పెట్టుకోవద్దు.. వైసీపీ నేతలకు గంగుల కమలాకర్ వార్నింగ్

వైసీపీ నేతలు తెలంగాణపై ఎందుకు విషం చిమ్ముతున్నారని తెలంగాణమంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.

Gangula Kamalakar మాతో పెట్టుకోవద్దు.. వైసీపీ నేతలకు గంగుల కమలాకర్ వార్నింగ్

Gangula Kamalakar: వైసీపీ నేతలు తెలంగాణపై ఎందుకు విషం చిమ్ముతున్నారని తెలంగాణమంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డిది కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే బుద్ది అని ఆయన మండిపడ్డారు. ఎస్ కుటుంబంలో తల్లిని కొడుకుని.. కొడుకుని , చెల్లిని, అన్నని విచ్ఛిన్నం చేస్తున్నాడని కమలాకర్ ఆరోపించారు. 2009లో తాను ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా వున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో కూడా తెలియదని గంగుల అన్నారు. 2014లో వైఎస్ కుటుంబంలో ఉడుములాగా ప్రవేశించాడని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విచ్ఛిన్నం చేయడంలో ముఖ్య భూమిక పోషించింది సజ్జల రామకృష్ణారెడ్డే అని గంగుల ఆరోపించారు.

కేసీఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడే వైసీపీ మంత్రులూ ఖబడ్దార్ అంటూ కమలాకర్ హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని.. ఏపీ నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నాయని గంగుల అన్నారు. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వారిని తెలంగాణలో వుంటారా..? ఆంధ్రాలో వుంటారా అని అడిగితే తెలంగాణలోనే వుంటామని చెబుతారని గంగుల పేర్కొన్నారు. బీజేపీ కనుసన్నల్లోనే వైసీపీ పనిచేస్తోందని మోటార్లకు మీటర్లు పెట్టమని కేసీఆర్ చెబితే, జగన్ ఎందుకు పెట్టారని మంత్రి ప్రశ్నించారు.

దేశంలోనే తెలంగాణ ప‌థ‌కాలు మంచిగా ఉన్నాయ‌ని చెబుతున్నామ‌ని, ఆ క్ర‌మంలోనే ఇత‌ర రాష్ట్రాల పేర్ల‌ను, పొరుగు రాష్ట్రాల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. అయినా వైసీపీ పాల‌న బాగుంటేహ‌రీశ్ వ్యాఖ్య‌ల‌తో స‌జ్జ‌ల ఎందుకు ఉలిక్కిప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ స‌త్తా ఏమిటో మ‌రోమారు చూపించాలంటే అందుకు తాము సిద్ధంగానే ఉన్నామ‌న్న గంగుల త‌మ‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో 2014కు ముందు ఉద్య‌మంలోనే చూపించామ‌ని గుర్తు చేశారు. ఇక‌నైనా త‌మ‌తో పెట్టుకోవ‌ద్ద‌ని వైసీపీ నేత‌ల‌కు గంగుల సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి : తెలంగాణ న్యూస్ 

ఇవి కూడా చదవండి: