IPL 2025 : టాస్ గెలిచిన చెన్నై.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ ధోనీ

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్‌లో చెన్నై ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఆర్సీబీ జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో ఎన్గిడిని జట్టులోకి తీసుకుంది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తున్నది. ఈ సీజన్‌లో ఇది రెండో మ్యాచ్. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరువైంది. మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్ బెర్తు దాదాపు ఖాయం కానున్నది. మరో వైపు చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగింది. పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న జట్టు గణాంకాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించనున్నది. అదే సమయంలో ఇతర జట్ల ప్లేఆఫ్ అవకాశాలను సైతం ప్రభావితం చేసే అవకాశం ఉంది.
చెన్నై జట్టు : షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, శామ్ కర్రన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా, ధోనీ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మతీషా పతి రానా ఉన్నారు.
ఆర్సీబీ జట్టు : జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, ఎన్గిడి, యశ్ దయాల్ ఉన్నారు.
ఆర్‌సీబీ సబ్ ప్లేయర్స్ : సుయాష్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, స్వప్నిల్ సింగ్ ఉన్నారు.
చెన్నై సబ్ ప్లేయర్స్ : శివమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, కమలేష్ నాగర్‌కోటి, రామకృష్ణ ఘోష్, జామీ ఓవర్టన్ ఉన్నారు.