Last Updated:

BRS: బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు ఏడాదిలో ఎంత పెరిగాయో తెలుసా ?

తెలంగాణ రాష్ట్రసమితి ( టిఆర్ఎస్ ) పేరు భారత రాష్ట్రసమితి ( బీఆర్ఎస్ ) గా మారిన సంగతి తెలిసిందే.

BRS: బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు ఏడాదిలో ఎంత పెరిగాయో తెలుసా ?

BRS: తెలంగాణ రాష్ట్ర సమితి ( టిఆర్ఎస్ ) పేరు భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ ) గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఆస్తుల విలువ గడిచిన ఏడాదిలో భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అన్ని వనరుల ద్వారా పార్టీకి వచ్చిన మొత్తం ఆస్తుల విలువ రూ. 480 కోట్లకు చేరింది. 2021 నుంచి 22 వరకు రూ. 218.11 కోట్లకు చేరనట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన 2022 ఆడిటర్ రిపోర్ట్ లో పేర్కొంది.. బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీస్ లో 2022 మార్చి 31 నాటికి రూ. 451 కోట్లు డిపాజిట్ చేసినట్లు పేర్కొంది.

ఈ ఏడాది ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ.153 కోట్లు, ట్రస్టుల ద్వారా రూ.40 కోట్ల ఇన్‌కం వచ్చినట్లుగా బీఆర్ఎస్ వెల్లడించిన ఈ నివేదికలో వెల్లడించింది. ఈ రెండు మార్గాల్లో గత ఏడాది ఎలాంటి ఆదాయం లేకపోవడం విశేషం. ఇదే సమయంలో పార్టీ మొత్తం ఆస్తుల విలువ ఒకే ఒక సంవత్సరంలో రూ.288 కోట్ల నుంచి రూ.480 కోట్లకు చేరిపోయింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 12 నెలలకు మించి కాల పరిమితితో కూడిన డిపాజిట్ల రూపంలో పార్టీ 2022 మార్చి 31 నాటికి రూ.451 కోట్ల నిధులు జమ చేసింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ.256 కోట్ల దాకా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: