Last Updated:

Pawan Kalyan-Suryaradhana: సూర్యారాధన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

విజ్ఞానాభివృద్ధికీ, సుఖ సంతోషాలకు, క్షేమానికీ ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడిని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగం. ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరమని చెబుతూ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు ప్రస్తావిస్తారు.

Pawan Kalyan-Suryaradhana: సూర్యారాధన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan-Suryaradhana: విజ్ఞానాభివృద్ధికీ, సుఖ సంతోషాలకు, క్షేమానికీ ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడిని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగం. ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరమని చెబుతూ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు ప్రస్తావిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధాన ఆచరిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాదికాలు నిర్వహించారు.

ఆదివారానికి విశిష్టత (Pawan Kalyan-Suryaradhana)

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగా సూర్యారాధన చేసారు.ఆదిత్య యంత్రం ఎదుట వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని అరాధించారు గతంలో పవన్ కళ్యాణ్ నిత్యం సూర్య నమస్కారాలు చేసేవారు అయితే వెన్ను సంబందిథ ఇబ్బందితో గత కొద్ది కాలంగా సూర్య నమస్కారాలు చేయడం వీలు కాలేదు దీనితో సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్ర సహిత ఆరాధనను నిర్వర్తించారు. శ్రీ మహా విష్ణువు సూర్యభగవానుడి నుంచి చక్రాయుధాన్ని పొందాడు. ఆరోగ్యానికి సైతం సూర్యారాధన మేలు చేస్తుంది. బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోయింది. కానీ మన సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉంది. రవి వారం అని పిలిచే ఆ రోజు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారు. అందుకే ఆదివారాన్ని కృషి వారం అని కూడా అనవచ్చు అని వేద పండితులు తెలిపారు. వారాహి దీక్ష, సూర్యారాధనలు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాల శర్మల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

 

pawan

 

ఇవి కూడా చదవండి: