Nagababu: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నాగబాబు భేటీ

Meets Deputy CM PawanKalyan After Taking Oath As MLC: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలో పవన్ కల్యాణ్‌తో ఎమ్మెల్సీ నాగబాబు భేటీ అయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన నాగబాబుకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికయ్యారు.
అంతకుముందు ఎమ్మెల్సీ నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. ఈ మేరకు చంద్రబాబును శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎంతో భేటీలో భాగంగా ఆయన శాలువాతో సత్కరించారు. అనంతరం వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని నాగబాబుకు చంద్రబాబు బహూకరించారు.