Last Updated:

Jana Sena Party: రాజకీయాలే కారణం.. ‘ఆపరేషన్ కొల్లూరు’పై జనసేన కీలక ప్రకటన!

Jana Sena Party: రాజకీయాలే కారణం.. ‘ఆపరేషన్ కొల్లూరు’పై జనసేన కీలక ప్రకటన!

Jana Sena Party Announces Operation Kolluru: ‘ఆపరేషన్ కొల్లూరు’పై జనసేన కీలక ప్రకటన చేసింది. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు కొల్లూరు విధ్వంసంపై జనసేన ప్రస్తావించింది. కొల్లూరు సమస్య జటిలం కావడానికి రాజకీయాలే కారణమని చెప్పుకొచ్చింది. ఆపరేషన్ కొల్లూరు పేరుతో నాటి వైఎస్ ప్రభుత్వం చెరువుల గట్లు పేల్చేసిందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం మాది అని జనసేన వెల్లడించింది. కొల్లూరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని జనసేన స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, జనసేన పార్టీ సిద్ధాంతాలపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికారిక ప్రకటన చేశారు. ‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’జనసేన పార్టీ ప్రాథమిక సిద్ధాంతాలలో ముఖ్యమైన సిద్ధాంతమని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ సిద్ధాంతాన్ని సమాజంలోనే కాకుండా, పార్టీ చేపట్టే ప్రతీ కార్యక్రమంలో అమలు చేస్తూ కార్యక్రమం నిర్వహించిన వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశుభ్రపరిచే కార్యక్రమాలు చెప్పట్టడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు.

 

ఇందులో భాగంగానే జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు. కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్క‌ృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానమన్నారు.

ఇవి కూడా చదవండి: