Deputy CM Pawan Kalyan: కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. షెడ్యూల్ ఇదే!
![Deputy CM Pawan Kalyan: కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. షెడ్యూల్ ఇదే!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-12-at-12.22.38.jpeg)
Deputy CM Pawan Kalyan Tour Off Kerala, Tamilanadu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరం నుంచి కోలుకున్నారు. నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
సనాతన ధర్మపరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. కాగా, జ్వరం నుంచి కోలుకున్న అనంతరం పవన్ కల్యాణ్ నేరుగా కేరళ బయలుదేరారు. కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. తొలుత కేరళలోని పలు పుణ్య క్షేత్రాలను పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు. అయితే ఎయిర్ పోర్టులో పవన్ కల్యాణ్ సంప్రదాయ వస్త్రధారణలో, పారగాన్ స్లిప్పర్స్ ధరించాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు. మొత్తం ఈ యాత్రలో భాగంగా మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడులోని ఏడు క్షేత్రాలను సందర్శించనున్నారు. ఇందులో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి వంటి ప్రముఖ దేవాలయాలను పవన్ కల్యాణ్ సందర్శించనున్నట్లు సమాచారం.