DSC Notification: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. ఏప్రిల్‌లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్

CM Chandrababu About DSC notification Announcement: సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. అమరావతిలో కలెక్టరతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభమయ్యే సరికి పోస్టింగ్స్ పూర్తి కావాలని చెప్పారు. అలాగే రెవెన్యూ భూ సమస్యలపై కలెక్టర్ల సదస్సులో చర్చించారు. ఈ మేరకు భవిష్యత్ లక్ష్యాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
స్కూళ్లు ప్రారంభ సమయానికే నియామక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. అయితే ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీని భర్తీ చేయనున్నట్లు వివరించారు. అలాగే 2027 నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా అమరావతిలో ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయడంతో పాటు ప్రపంచంలోనే బెస్ట్ మోడల్‌తో అమరావతిని డెవలప్ మెంట్ చేస్తామని ఆయన అన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం ఒక వ్యక్తి కారణంగా నాశనమైందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదని, అందుకే కూటమికి ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారన్నారు. ఐదేళ్లకు ఒకసారి ప్రజలు తీర్పు ఇస్తారని చెప్పారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని చంద్రబాబు తెలిపారు.
ఇక, కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదని, క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుందని, కొంతమంది అభివృద్ధఇచేస్తే.. మరికొంతమంది నాశనం చేస్తారన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్తిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామన్నారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదని, సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలన్నారు.