Home / ap news
ఏపీ అసెంబ్లీ శుక్రవారం రెండు కీలక తీర్మానాలు ఆమోదించింది. బోయ, వాల్మీకి కులస్థులను ఎస్టీల్లో చేర్చాలని ఒకతీర్మానం, దళిత క్రిష్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని మరో తీర్మానం చేసింది. అసెంబ్లీలో ఆమోదించిన 2 తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని సీఎం జగన్ అన్నారు.
:ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఊహించని విజయాన్ని కైవసం చేసుకుంది. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి... 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి
స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో చంద్రబాబు అతిపెద్ద స్కాంకు పాల్పడ్డారని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చేసిన ఆరోపణలపై కాపుసంక్షేమసేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. స్కాంలో చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని.. లేనిపక్షంలో జనసేన టిడిపితో కలిసే అవకాశాలు ఉండవన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే, అవినాష్ రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
నేను తలచుకుంటే 10 సినిమాల్లో హీరోగా నటించి వాటిని సూపర్ హిట్స్ చేయగలను అంటూ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏకచిత్ర నటుడు అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Vijayawada Education News : సివిల్ సర్వీస్ కోచింగ్ ఇవ్వడం లో అనుభవం కలిగిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ, ఎస్.ఆర్.ఆర్ & సి.వీ.ఆర్ తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 7వ తేదిన విజయవాడలో ఎస్.ఆర్.ఆర్ & సి.వీ.ఆర్ కళాశాలలో తక్షశిల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బిఎస్ఎన్ దుర్గా ప్రసాద్, ఎస్ ఆర్ ఆర్ డిగ్రి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి పరస్పర అవగాహన ఒప్పందం పై సంతకం చేసారు. ఈ […]
ఆంధ్రప్రదేశ్ వైద్యరంగ చరిత్రలో మణిపాల్ హాస్పటిల్ విజయవాడ మరో అరుదైన ఘనత సాధించింది. కేవలం ఒక్క ఏడాది లోనే అత్యంత క్లిష్టతరమైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క సంవత్సరంలో సుమారు 70కి పైగా ఇలాంటి అరుదైన సర్జరీలను నిర్వహించిన ఏకైక హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ కావడం గమనార్హం.
రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా లింగరాజుపాలెం కస్తుర్భా పాఠశాల విద్యార్థినుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరితో కన్నీరు పెట్టిస్తోంది. మంచిగా చదువు చెబుతారని ఇక్కడ చేరామని.. కానీ ఆ పరిస్థితి లేదంటూ బాలికలు కన్నీటి పర్యంతం అయ్యారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.
కాపులకు ఈడబ్ల్యుఎస్ కింద 5 శాతం రిజర్వేషన్ ను కేటాయించాలని కోరుతూ ఏపీ హైకోర్టులోమాజీ మంత్రి హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేశారు