Last Updated:

KCR: కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు, చిరంజీవి

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి అన్ని విషయాలను తెలుసుకున్నారు.

KCR: కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు, చిరంజీవి

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి అన్ని విషయాలను తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆయన తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు.

కేసీఆర్ త్వరగా కోలుకోవాలి..(KCR)

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ను పరామర్శించాను. ఆయన కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని చెప్పారు. ఆయన కోలుకుని తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చిరంజీవి కోరుకున్నారు.యశోద ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్‌ను తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు తనకు చెప్పినట్లు భట్టి వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.కేసీఆర్‌ను బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. కేటీఆర్‌ను కలిసి కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ లు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మోత్కుపల్లి. చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు కూడా కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.