Operation Sindoor : భారత్-పాకిస్థాన్ యుద్ధం.. కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం

Telugu jawan martyred in firing : భారత్-పాక్ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దేశ సరిహద్దు ప్రాంత్రాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. దీంతో భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఆ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. మృతిచెందిన జవాన్‌ను మురళీనాయక్‌గా గుర్తించారు. ఇతడి స్వస్థలం ఏపీలోని రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లితండా. రేపు గ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానున్నట్లు సమాచారం. వీర జవాన్ సోమందేపల్లి మండలం నాగినాయని చెర్వుతండాలో పెరిగాడు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివాడు.
మురళి నాయక్ మృతి విషాదకరం : సీఎం చంద్రబాబు
దేశ రక్షణంలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ మృతిపై సీఎం చంద్రబాబు స్పందించారు. సైనికుడు మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. కాగా, మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మురళి నాయక్‌కు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళినాయక్ త్యాగాన్ని మరువలేమన్నారు. ఈ సందర్భంగా ఆయక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.