Emergency in Pakistan: భారత్ దెబ్బకు ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్!

Emergency Declared in Pakistan due to India Strikes: పాకిస్తాన్‌కు భారత్ చుక్కలు చూపిస్తుంది. పాక్ ఎయిర్ బేస్‌లపై భారత్ డ్రోన్లతో దాడి చేస్తుంది. భారత్ ప్రతి దాడులకు పాక్ హడలిపోతుంది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఓ బంకర్‌లో దాక్కున్నట్లు సమాచారం. రావల్పిండిలో నూర్‌ఖన్ ఎయిర్‌బేస్, రఫీకి, మురిద్, చక్వాల్‌పై భారత్ దాడి చేస్తుంది. ఎయిర్‌బేస్‌లు ధ్వంసం అవుతుండటంతో పాకిస్థాన్ ఆందోళనలో పడింది.
భారత్ దెబ్బకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇప్పటికే పెట్రోల్ బంక్‌లు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రపంచ దేశాల కాళ్లు పట్టుకుంటుంది. ఉద్రిక్తతలు అదుపు చేయాలని అమెరికాకు విన్నవించుకుంటుంది. ట్రంప్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించి పాక్ విఫలమైంది. లాహోర్ ఎయిర్ బేస్‌ను భారత్ టార్గెట్ చేసింది. భారత్ చర్యలతో పాకిస్తాన్ వణికిపోతుంది.
కాశ్మీర్ ప్రాంతంలోని పూంచ్ సెక్టార్‌లో జనావాసాలను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఎత్తైన కొండల నుంచి విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతుంది. దీంతో ఇళ్లపై మోర్టార్ షెల్స్ పడుతున్నాయి. భారీ శబ్దాలు, కాల్పుల మోతతో పూంచ్ సెక్టార్‌లో క్షణక్షణం భయం భయంగా మారింది. దీంతో పాకిస్తాన్ పై భారత్ ముప్పేట దాడి చేస్తోంది.
ఒకవైపు నీటి యుద్ధం మరోవైపు ఆపరేషన్ సింధూర్(Operation Sindoor). దీంతో పాటు పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు. ఈ చర్యలతో పాకిస్తాన్ కళ్లు తేలేస్తోంది. భారత్ దెబ్బ మీద దెబ్బ తీస్తుంటే ఏం చేయాలో తోచక లబోదిబోమంటోంది. భారతదేశాన్ని పాకిస్తాన్ చాలా తక్కువగా అంచనా వేసింది. ఇప్పుడు అందుకు పాకిస్తాన్ భారీగా మూల్యం చెల్లిస్తోంది.
భారత్ , పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది. ఈ ఉద్రిక్త పరిస్థితులపై వివిధ దేశాధినేతలు స్పందించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని చైనా పేర్కొంది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని చైనా సలహా ఇచ్చింది. అయితే భారత్ , పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకునేది లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుండబద్దలు కొట్టారు.