Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

Rain Alert to andhra pradesh from today to next three days: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. నేటి నుంచి రానున్న మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నట్లు అంచనా వేసింది.
ఇందులో భాగంగానే నేడు పలు ప్రాంతాల్లలో పిడుగులతో కూడిన వర్షం పడవచ్చని తెలిపింది. ఈ మేరకు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు విశాఖపట్నంతో పాటు కాకినాడ, అనకాలపల్లి, తూర్పుగోదావరి, బీఆర్ అంబేద్కర్ కొనసీమ, ఏటూరు పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం, తిరుపతి, వైఎస్సార్ వంటి జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
కాగా, ఇవాళ విజయవాడలో ఉదయం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి జనజీవనం స్తంభించింది. రూడ్లపై వర్షపునీరు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గత కొంతకాలంగా విపరీతమైన ఎండలతో ఇబ్బందులు పడ్డ నగరప్రజలకు వర్షం పడడంతో కాస్తా ఉపశమనం ఏర్పడింది.
ఇదిలా ఉండగా, గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు విద్యుత్ స్థంభాలతో పాటు చెట్లు నేలమట్టమయ్యాయి. పలు చోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా వైఎస్సార్, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.