Pawan Kalyan – Ambati Rayudu: పవన్‌ది- నాది ఒకేదారి .. అంబటి రాయుడు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని కలిసిన తరువాత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తమ భేటీపై స్పష్టతనిస్తూ ట్వీట్ చేశారు. ఎపి ప్రజలకి సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చి వైసిపిలో చేరానని అంబటి రాయుడు తెలిపారు. తన ఆశలు, ఆశయాలు ఫలిస్తాయని అనుకున్నానని అంబటి రాయుడు చెప్పారు.
Pawan Kalyan – Ambati Rayudu: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని కలిసిన తరువాత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తమ భేటీపై స్పష్టతనిస్తూ ట్వీట్ చేశారు. ఎపి ప్రజలకి సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చి వైసిపిలో చేరానని అంబటి రాయుడు తెలిపారు. తన ఆశలు, ఆశయాలు ఫలిస్తాయని అనుకున్నానని అంబటి రాయుడు చెప్పారు. చాలా ప్రాంతాల్లో తిరిగి ప్రజలని కలుసుకుని వారి సమస్యలని అర్థం చేసుకున్నానని అంబటి రాయుడు వివరించారు.
కలలు నెరవేరే అవకాశం లేదని..(Pawan Kalyan – Ambati Rayudu)
కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తన కలలు నెరవేరే అవకాశం లేదన్నది అర్థం అయిందని అంబటి రాయుడు వివరించారు. ఈ విషయంలో తానెవరినీ నిందించబోనని అంబటి రాయుడు స్పష్టం చేశారు. తన సిద్ధాంతాలు, వైఎస్ఆర్‌సిపి సిద్ధాంతాలు కలవలేదని అంబటి రాయుడు వెల్లడించారు. అయితే ఇది ఏ సీటునుంచి పోటీ చేయాలన్న అంశానికి సంబంధం లేనిదని అంబటి రాయుడు చెప్పారు.రాజకీయాలనుంచి దూరం జరగాలని నిర్ణయించుకున్నాక తన శ్రేయోభిలాషులు, సన్నిహిత మితృలు, కుటుంబ సభ్యులు ఒకసారి పవన్ కళ్యాణ్‌ని కలవాలని సూచించారని అంబటి రాయుడు వివరించారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల గురించి అర్థం చేసుకోవాలని హితవు పలికారని అంబటి రాయుడు తెలిపారు. పవన్ కళ్యాణ్‌ని కలిసి చాలా సమయం గడిపానని జీవితం, రాజకీయాలగురించి మాట్లాడుకున్నామని అంబటి రాయుడు చెప్పారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తన సిద్ధాంతాలు ఒకే రకంగా ఉన్నాయని అర్ధమైందని అంబటి అన్నారు. ప్రస్తుతం తాను దుబాయ్‌కి క్రికెట్ ఆడేందుకు వెళుతున్నానని, ఎల్లప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకోసం పని చేస్తూనే ఉంటానని అంబటి రాయుడు ముగించారు.