Hand Pump: రోడ్డు మద్యలో నీటి పంపు.. అధికారుల బాధ్యతారాహిత్యానికి నిలువుటద్దం
ఏపీలో ప్రభుత్వ శాఖల మద్య అవగాహన లేకుండా పోయింది. ఆయా శాఖల నిర్వాహకంతో ప్రజలు ఇబ్బందులు పాలౌతున్నారు. అలాంటి ఓ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకొనింది.
Nellore: ఏపీలో ప్రభుత్వ శాఖల మద్య అవగాహన లేకుండా పోయింది. ఆయా శాఖల నిర్వాహకంతో ప్రజలు ఇబ్బందులు పాలౌతున్నారు. అలాంటి ఓ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకొనింది.
వివరాల్లోకి వెళ్లితే, కోవూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బ కొత్త కాలనీలో అంతర్గత రోడ్డు నిర్మాణానికి సిమెంటు రోడ్డు మంజూరైంది. నిధులు కూడా విడదల కావడంతో టెండరు ద్వారా సిసి రోడ్డు పనులు వెంటనే చేపట్టారు. రోడ్డు వేసే క్రమంలో గతంలో ఉన్న మట్టిరోడ్డు మద్యలో ఓ చేతినీటి పంపును ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు ఏర్పాటు చేసివున్నారు.
అయితే టెండరుదారుడు రోడ్డు మద్యలో చేతిపంపును అలాగే ఉంచుతూ సీసీ రోడ్డును పూర్తి చేశాడు. ఆ సమయంలో గ్రామస్ధులు పంపును రోడ్డు సైడుకు మరల్చాలని చెప్పినా వినకుండా రోడ్డు పనులు పూర్తి చేశారు. రెండు శాఖల మద్య చేపట్టిన పనులు నేపధ్యంలో అధికారులు చేతిపంపును పక్కకు జరిపే విషయంలో పెద్దగా పట్టించుకోలేకపోయారు. అనువైన రోడ్డు మార్గం ఉన్నప్పటికీ రోడ్డుకు అడ్డంగా ఉన్న చేతినీటి పంపుతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
ఇది కూడా చదవండి: Apsrtc: ఆర్టీసీ డ్రైవర్ నిర్వాకం.. నడి రోడ్డుపై బస్సును ఆపి పరార్