Published On:

Cockroach Milk: బొద్దింక పాలల్లో పోషకాలు! ఎప్పుడూ చూడని సూపర్ ఫుడ్!

Cockroach Milk: బొద్దింక పాలల్లో పోషకాలు! ఎప్పుడూ చూడని సూపర్ ఫుడ్!

 

  • బొద్దింక పాలల్లో పోషకాలు! ఎప్పుడూ చూడని సూపర్ ఫుడ్!

 

Cockroach Milk: ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు’ ఇది మన సంసృతిలో అంత్యంత ప్రాచుర్యం పొందిన సామేత. అంటే ఆవుపాలు గరిెటెడైనా చాలు గాడిదపాలు ఎక్కువ ఉన్నా లాభం లేదని నానుడి. అయితే ఇఫ్పుడు కనీ వినీ ఎరుగని పాలను కనుగొన్నారు. అదే బొద్దింక పాలు.

 

cockroach milk

cockroach milk

 

ఏంటి షాక్ అయ్యారా, అసలు బొద్దింకను చూస్తేనే అనుబాంబు పడ్డంత బయపడే జనం. ఈ పాలను తాగాలా అని అడగాలని ఉందా?. అయితే వెల్దాం పదండి విషయంలోకి…  శాస్త్రవేత్తల తాజా పరిశోధన ప్రకారం “పసిఫిక్ బీటిల్” (Pacific Beetle) అనే బొద్దింక పాలను సూపర్ ఫుడ్ అంటున్నారు. ఇందులో పోషకాలు సమృద్దిగా ఉన్నాయట, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు చక్కెర కలిగి ఉన్నాయట. భవిష్యత్తులో సూపర్ ఫుడ్ గా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

 

 

high protein in cockroach milk

high protein in cockroach milk

 

 

సూపర్ ఫుడ్ అనే పదాన్ని విరివిగా వాడతారు, ఎందులో అయితే ఆరోగ్యంతో పాటు ఫిట్ నెస్ కు కావల్సినవి లభిస్తాయో వాటినే సూపర్ ఫుడ్ గా గుర్తిస్తారు. సాధారణంగా ఆకుకూరలు, బెర్రీలు, నట్స్, వీటిల్లో అధిక స్థాయిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి సాధారణ ఆరోగ్యాన్ని మాత్రమే ఇస్తాయి. ఇంతకంటే ఎక్కువ ఆరోగ్యాన్ని కలిగించే ఫుడ్ ను సూపర్ ఫుడ్ గా గుర్తిస్తారు. ఇప్పుడు బొద్దింక పాలను శాస్త్రవేత్తలు సూపర్ ఫుడ్ అంటున్నారు.

 

“పసిఫిక్ బీటిల్” (Pacific Beetle) అనే బొద్దింకపాలు గేదె, ఆవు పాలకంటే మూడు రేట్లు ఎక్కువ పోషకాలు కలిగిఉన్నయని కనుగొన్నారు. వింతగా అనిపించినా ఇటీవలి శాస్త్రీయ పరిశోధనలో కనుగొన్నారు.

“పసిఫిక్ బీటిల్” అనే (Pacific Beetle) బొద్దింక, దాని పిల్లలను పోషించడానికి పోషకాలు సమృద్దిగా ఉండే పాల పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ద్రవంలో ప్రోటీన్లు, కొవ్వు, చెక్కర ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ఇప్పటివరకు గుర్తించబడిన అత్యంత పోషకాలు కలిగిన సహజంగా లభించే పదార్ధాలలో ఇది ఒకటని అంటున్నారు. భవిష్యత్తు ఆహార సాంకేతికతలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని పరిశోధకులు నమ్ముతున్నారు.

 

 

high protein in pacific beetle cockroach milk

high protein in pacific beetle cockroach milk

 

పరిశోధనలో ఏమి కనుగొన్నారు
“జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టల్లాగ్రఫీ“లో ప్రచురించబడిన 2016 అధ్యయనం ప్రకారం, ఈ విచిత్రమైన పాల లాంటి పదార్థాన్ని కనుగొన్నట్లుగా చెప్పారు. “పసిఫిక్ బీటిల్”(Pacific Beetle) బొద్దింకల కడుపులో పాలలాంటి పదార్థాన్ని గుర్తించామని తెలిపారు. వీటిలో ఉన్న పాలు.. కణాల మరమ్మత్తు, పెరుగుదలకు ఉపయోగపడతాయంటున్నారు.

 

మనుషులు ఈ బొద్దింక పాలు తాగవచ్చా
“పసిఫిక్ బీటిల్” (Pacific Beetle) అనే బొద్దింక పాలను సూపర్ ఫుడ్ గా గుర్తించినప్పటికి మనుషులు వినియోగించడానికి అందుబాటులో లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. బొద్దింక నుంచి పాలను తీయడం అత్యంత కష్టమైన పని కాబట్టి ఉత్పత్తి అంత సులభం కాదన్నారు. ఇందుకు మరింత పరిశోధన అవసరమైనప్పటికీ భవిష్యత్తులో స్థిరమైన ఫలితాలను ఇస్తుందని ఆశాబావం వ్యక్తం చేశారు.