Last Updated:

TSPSC Group 1: టీఎస్పిఎస్సి ప్రైమరీ కీ లింకు వివరాలు ఇవే!

ఈ నేపథ్యంలో శనివారం కీ విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ నిర్నయించింది. ప్రైమరీ కీతో పాటు అభ్యర్థుల OMR షీట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయనుంది.

TSPSC Group 1: టీఎస్పిఎస్సి ప్రైమరీ కీ లింకు వివరాలు ఇవే!

Hyderabad: ఇటీవల జరిగిన 503 గ్రూపు-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం మన అందరికీ తెలిపిందే. ఈ నెల 16న ఈ పరీక్షను అధికారులు నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 2,86,031 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు దీనికి సంబంధించిన ప్రైమరీ కీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం కీ విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ నిర్నయించింది. ప్రైమరీ కీతో పాటు అభ్యర్థుల OMR షీట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయనుంది. అభ్యర్థులు తమ OTR వివరాలతో లాగిన్ అయ్యి కీని కూడా చూసుకోవచ్చు. కీ విడుదలైనా రోజు నుంచి 5 రోజుల పాటు పరీక్ష రాసిన అభ్యర్థులు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

పరీక్ష రాసిన అభ్యర్థులు https://www.tspsc.gov.in/ లింక్ ద్వారా తమ OMR స్కాన్ కాపీలను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: