Last Updated:

Hospital : డెంగ్యూ రోగికి పండ్ల రసాన్ని ఎక్కించారని ఆరోపణలు.. ఆసుపత్రి కూల్చివేతకు నోటీసులు

డెంగ్యూ రోగికి బ్లడ్ ప్లేట్‌లెట్స్‌కు బదులుగా పండ్ల రసాన్ని ఎక్కించిన ఆరోపణలతో యూపీలోని ప్రయాగ్ రాజ్ లో గ్లోబల్ హాస్పిటల్ కూల్చివేతకు నోటీసును అందజేసారు

Hospital : డెంగ్యూ రోగికి పండ్ల రసాన్ని ఎక్కించారని ఆరోపణలు..  ఆసుపత్రి కూల్చివేతకు  నోటీసులు

Hospital: డెంగ్యూ రోగికి బ్లడ్ ప్లేట్‌లెట్స్‌కు బదులుగా పండ్ల రసాన్ని ఎక్కించిన ఆరోపణలతో యూపీలోని ప్రయాగ్ రాజ్ లో గ్లోబల్ హాస్పిటల్ కూల్చివేతకు నోటీసును అందజేసారు .అక్టోబర్ 28 లోగా ఆసుపత్రిని ఖాళీ చేయమని కోరారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్‌ పాఠక్‌ విచారణలో ఆసుపత్రిదోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్లేట్‌లెట్ల ప్యాకెట్‌ను పరీక్షల నిమిత్తం పంపినట్లు తెలిపారు. గ్లోబల్ హాస్పిటల్ డెంగ్యూ రోగికి ప్లేట్‌లెట్స్ స్థానంలో ‘మౌసంబి’ జ్యూస్‌ని అందిస్తున్న వీడియో వైరల్ కావడంతో వెంటనే ఆసుపత్రికి సీల్‌ వేసి ప్లేట్‌లెట్స్ ప్యాకెట్‌ని పరీక్షకు పంపారు. నేరం రుజువైతే , ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని పాఠక్ హిందీలో ట్వీట్ చేశారు.అంతకుముందు, అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎకె తివారీ విచారణలో “కొన్ని అవకతవకలు” కనుగొనబడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి కావడంతో ఆసుపత్రికి సీలు వేయబడింది.

అయితే, ఆసుపత్రి యజమాని సౌరభ్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ప్లేట్‌లెట్లను రోగికి అటెండర్లు తీసుకొచ్చారు.ప్లేట్‌లెట్స్ తీసుకురావడానికి అటెండర్లకు స్లిప్ ఇచ్చారు. సాయంత్రం ఐదు యూనిట్ల ప్లేట్‌లెట్స్ తెచ్చారు. మూడు యూనిట్లు వాడినప్పుడు రోగికి రియాక్షన్ వచ్చింది, రక్తమార్పిడిని ఆపాము. అటెండర్లు తెచ్చిన ప్లేట్‌లెట్స్ రోగికి రోగికి ఎక్కించారు. ఇది బయట బ్లడ్ బ్యాంక్‌కు చెందినది. దానికి ఆసుపత్రి బాధ్యత వహించదని చెప్పాడు.రోగి ఆరోగ్యం క్షీణించడంతో అటెండర్లు అభ్యర్థించడంతో మేము రోగిని ఉన్నత కేంద్రానికి రిఫర్ చేసాము. రోగి ఇక్కడ మరణించలేదు, రెండు రోజుల తరువాత మరొక ఆసుపత్రిలో మరణం సంభవించిందని మిశ్రా తెలిపాడు.ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి: