Last Updated:

Crime News : యువతిని దారుణంగా చంపిన జంట.. 30 ముక్కలుగా నరికిన వైనం

ఒడిస్సాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక యువతిని హత్య చేసి, ఆమె శరీరాన్ని 30 ముక్కలుగా నరికిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతానికి ప్రేమ వ్యవహారమే కారణం అని పోలీసులు నిర్ధారించారు. కాగా మృతురాలి వయస్సు  21 సంవత్సరాలు అని తెలుస్తుంది. ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

Crime News : యువతిని దారుణంగా చంపిన జంట.. 30 ముక్కలుగా నరికిన వైనం

Crime News : ఒడిస్సాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక యువతిని హత్య చేసి, ఆమె శరీరాన్ని 30 ముక్కలుగా నరికిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతానికి ప్రేమ వ్యవహారమే కారణం అని పోలీసులు నిర్ధారించారు. కాగా మృతురాలి వయస్సు  21 సంవత్సరాలు అని తెలుస్తుంది. ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాయ్‌ఘర్ బ్లాక్‌లోని బగ్‌బేరా గ్రామం. తిల్బాటి గోండ్‌కు చెందిన బాలిక బుధవారం నుంచి కనిపించకుండా పోయింది. ఎన్ని చోట్ల వెతికినా బాలిక కనిపించకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం మురుమిడిహి గ్రామానికి చెందిన ఓ యువకుడు చింతచెట్టు కింద రక్తాన్ని చూసి గ్రామస్తులకు పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మట్టిలోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. తప్పిపోయిన బాలిక గురించి సమాచారం అందుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులను పిలిపించి మృతదేహాన్ని గుర్తించారు.

ఇక ఆ మృతదేహం మిస్ అయిన యువతిదే అని తేలడంతో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహం 30 ముక్కలుగా నరికి ఉండడాన్ని గమనించిన వారు కొందరు స్థానికులను విచారించగా అసలు విషయం బయటపడింది. దర్యాప్తులో భాగంగా ఓ జంటను అదుపులోకి తీసుకున్నారు.  మృతిచెందిన బాలికతో తను గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నామని నిందితుడు చెప్పాడు. బుధవారం సాయంత్రం మృతురాలు తననను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.

నిందితుడి భార్య బాలికకు వివరించేందుకు ప్రయత్నించడంతో ముగ్గురి మధ్య వాగ్వాదం మరింతగా ముదిరింది. పెళ్లి విషయంలో బాలిక పట్టుబట్టడంతో ఆ దంపతులు ఇద్దరూ కలిసి బాలికను కొట్టడం ప్రారంభించారు. ఈ గొడవలో తలకు బలమైన గాయం కావడంతో బాలిక మృతి చెందింది. దాంతో దంపతులు ఇద్దరూ కలిసి మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికి అడవిలో మట్టిలో పాతిపెట్టారు. వారి ఆనవాళ్లు లభించకుండా బట్టలు కూడా తగులబెట్టారు.