Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి మంజూరు
తెలంగాణ లో గత ప్రభుత్వం హయాంలో నిర్మాణం మొదలు పెట్టిన యాదాద్రి ధర్మల్ విద్యుత్కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి మంజూరు చేసింది .ఈ ప్రాజెక్టు వలన ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నో సార్లు విమర్శించడం గమనార్హం .దీని వలన లాభం కంటే నస్టమే ఎక్కువని అనవసరంగా కేసీఆర్ ఈ ప్రాజెక్టు ప్రారంభించారని చెబుతోంది.
Yadadri Power Plant: తెలంగాణ లో గత ప్రభుత్వం హయాంలో నిర్మాణం మొదలు పెట్టిన యాదాద్రి ధర్మల్ విద్యుత్కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి మంజూరు చేసింది .ఈ ప్రాజెక్టు వలన ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నో సార్లు విమర్శించడం గమనార్హం .దీని వలన లాభం కంటే నస్టమే ఎక్కువని అనవసరంగా కేసీఆర్ ఈ ప్రాజెక్టు ప్రారంభించారని చెబుతోంది.
ఎన్జీటీ కేసుతో..(Yadadri Power Plant)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు .ఇప్పుడు విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. పర్యావరణ సాధికార కమిటీ గత నెల 5, 8 తేదీల్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలను ఆమోదించినట్లు బుధవారం తెలంగాణ విద్యు దుత్పత్తి సంస్థ (జెన్కో)కు సమాచారం అందింది . నల్గొండ జిల్లా దామెరచర్ల వద్ద 4 వేల మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామ ర్ధ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి ప్లాంటుకు గతంలో ఒకసారి పర్యావరణ శాఖ ఈసీ జారీ చేసింది. అయితే ఈ ప్లాంటు నిర్మాణం వల్ల వెలువడే కాలుష్యంతో అమ్రాబాద్ అభయార ణ్యంలో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుం దంటూ ఒక స్వచ్ఛంద సంస్థ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో కేసు వేసింది. దీనిపై విచారణ జరిపి మళ్ళీ ఈసీ జారీ చేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యావరణ, విద్యుత్ శాఖల అధికారులు ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరిపి ఈఏసీకి నివేదిక పంపించారు. దాని ఆధారంగా తాజాగా మళ్లీ ఈసీ జారీకి అనుమతించింది.
ఈ ప్లాంటు నిర్మాణాన్ని తొలుత రూ.25,099.42 కోట్ల వ్యయంతో ప్రారంభించగా ప్రస్తుతం అది రూ.34,542.95 కోట్లకు చేరింది. కాలుష్యం వెలు వడకుండా పర్యావరణ పరిరక్షణకేరూ.5,681.44 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు జెన్కో తెలిపింది. అదే విధంగా ప్లాంటులో విద్యుదుత్పత్తి ప్రారంభమైన తరువాత ఏటా రూ.430.17 కోట్లను కాలుష్య నియంత్రణకు ఖర్చు పెడతామని వివరించింది. ఇదిలా ఉండగా ఈ ప్లాంటులో 2 వేల మందికి ప్రత్యక్షంగా , మరో 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఏటా ఈ ప్లాంటుకు కోటీ 40 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి గనుల నుంచి సర ఫరా చేస్తారు. . పర్యావరణ పరిరక్షణకు ప్లాంటు చుట్టుప క్కల 45 ఎకరాల్లో 27,900 మొక్కలు నాటి పెంచుతున్నట్లు తెలిపింది. వచ్చే జూన్ కల్లా చుట్టూ వంద మీటర్ల పరిధిలో తుంగపాడు వాగుకు సరిహద్దు వెంట మూడు వరుసల్లో మొక్కలు నాటి పెంచనున్నట్లు తెలిపింది. చుట్టూ గ్రీన్ బెల్ట్ ఏర్పడి పర్యావరణ పరిరక్షణకు దోహద పడుతుందంటూ జెన్కో ఇచ్చిన నివేదికను కమిటీ ఆమోదించి ఈసీ జారీకి అనుమతించింది.దింతో ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం కానున్నాయి .