Last Updated:

Bengaluru CEO: గోవాలో నాలుగేళ్ల కొడుకుని చంపిన బెంగళూరు సీఈవో

బెంగళూరులో ఏఐ స్టార్టప్‌కు సీఈవోగా ఉన్న ఒక మహిళ, తన భర్తను కలవకుండా అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసిందని సోమవారం అరెస్టు చేశారు. గోవా నుంచి బెంగళూరుకు వెళ్తుండగా చిత్రదుర్గలో కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్‌లో పోలీసులు పట్టుకున్నారు.

Bengaluru CEO: గోవాలో నాలుగేళ్ల కొడుకుని చంపిన  బెంగళూరు  సీఈవో

Bengaluru CEO:బెంగళూరులో ఏఐ స్టార్టప్‌కు సీఈవోగా ఉన్న ఒక మహిళ, తన భర్తను కలవకుండా అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసిందని సోమవారం అరెస్టు చేశారు. గోవా నుంచి బెంగళూరుకు వెళ్తుండగా చిత్రదుర్గలో కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్‌లో పోలీసులు పట్టుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. సుచనా సేథ్ (39) బెంగళూరుకు చెందిన స్టార్టప్ మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్‌కు సీఈవో. సేథ్ మరియు ఆమె భర్త 10 సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత 2020లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం నాడు కొడుకును కలిసేందుకు తండ్రికి కోర్టు అనుమతి ఇచ్చింది.కోర్టు ఆదేశాలతో ఇబ్బంది పడిన ఆ మహిళ తన కొడుకుతో కలిసి గోవా పర్యటనకు ప్లాన్ చేసింది. నార్త్ గోవాలోని కాండోలిమ్‌లోని హోటల్ గదిలో తన తండ్రితో సమావేశం కావడానికి ముందు ఆమె ఆ బాలుడిని హత్య చేసిందని వర్గాలు తెలిపాయి.కొడుకుతో కలిసి హోటల్ కు వెళ్లిన మహిళ ఒంటరిగా వెళ్లిపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. హోటల్ సిబ్బంది అప్రమత్తమై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

విడాకులతో డిస్ట్రబ్ అయి..(Bengaluru CEO)

దీనిపై నార్త్ గోవా పోలీస్ సూపరింటెండెంట్ నిధిన్ వల్సన్ మాట్లాడుతూ బెంగళూరుకు టాక్సీ ఏర్పాటు చేయమని సుచనా హోటల్ సిబ్బందిని కోరింది. చెక్అవుట్ తర్వాత, హోటల్ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి వెళ్ళినప్పుడు ఎర్రటి మరకలు కనిపించాయి. దీనిని రక్తంగా భావించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హోటల్‌కు చేరుకుని డ్రైవర్ ద్వారా మహిళను సంప్రదించేందుకు ప్రయత్నించారు.కారును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమని డ్రైవర్‌ను అడిగారు. లగేజీని తనిఖీ చేసి పోలీసులు బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి మహిళను అరెస్టు చేశారని నిధిన్ వల్సన్ చెప్పారు. ప్రాథమిక విచారణ ఆధారంగా, విడాకుల ప్రక్రియతో సుచనా బాగా డిస్ట్రబ్ అయిందని ఎస్పీ నిధిన్ వల్సన్ తెలిపారు.భర్తను కొడుకుతో కలవడం అడ్డుకునేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.