Last Updated:

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ భార్య ఆహారంలో టాయిలెట్‌ క్లీనర్‌!

పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు ఆయన భార్య బుష్రాబీబీ పలు కేసుల్లో జైల్లో ఉన్నారు. అయితే ఖాన్‌ భార్య బుష్రా బీబీకి జైల్లో ఆహరంలో టాయిలెట్‌ క్లీనర్‌ కలిపి ఇస్తున్నారని ఆమె అధికారి ప్రతినిధి ఆరోపించారు. అయితే దీనిపై కోర్టు మెడికల్‌ టెస్ట్‌లు జరిపించాలని ఆదేశించినా జైలు అధికారులు మాత్రం పట్టించుకోలేదని ఆమె అధికార ప్రతినిధి మషాల్‌ యుసుఫ్‌జాయ్‌ చెప్పారు.

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ భార్య ఆహారంలో టాయిలెట్‌ క్లీనర్‌!

Imran Khan: పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు ఆయన భార్య బుష్రాబీబీ పలు కేసుల్లో జైల్లో ఉన్నారు. అయితే ఖాన్‌ భార్య బుష్రా బీబీకి జైల్లో ఆహరంలో టాయిలెట్‌ క్లీనర్‌ కలిపి ఇస్తున్నారని ఆమె అధికారి ప్రతినిధి ఆరోపించారు. అయితే దీనిపై కోర్టు మెడికల్‌ టెస్ట్‌లు జరిపించాలని ఆదేశించినా జైలు అధికారులు మాత్రం పట్టించుకోలేదని ఆమె అధికార ప్రతినిధి మషాల్‌ యుసుఫ్‌జాయ్‌ చెప్పారు. కోర్టు ఆర్డర్ల ఉన్నా టెస్టులు జరిపించడంలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా ఇఫ్తార్‌ సందర్భంగా ఇచ్చే ఆహారంలో రెండు లేదా మూడు చుక్కల టాయిలెట్‌ క్లీనర్‌ కలిపి ఇచ్చారని గురువారం నాడు ఆమె అధికార ప్రతినిధి వెల్లడించారు. కాగా ఇమ్రాన్‌ భార్య బుష్రాకు ఫిబ్రవరి 24 షెబ్‌ -ఏ -బరాత్‌ రోజు ఆహారంలో టాయిటెల్‌ క్లీనర్‌ ఇచ్చారని అధికార ప్రతినిధి ఆరోపిస్తున్నారు.

జైలు అధికారులపై ఆరోపణలు..(Imran Khan)

టాయిలెట్‌ క్లీనర్‌ కలిపి ఇచ్చిన ఆహారం తిన్న తర్వాత ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడం మొదలైందని బుష్రా బీబీ అధికార ప్రతినిధి మషాల్‌ యుసుఫ్‌జాయ్‌ అక్కడి జియో న్యూస్‌కు తెలిపారు. పోలీసులు ఆమెను అరెస్టు చేయడానికి ముందు ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఎలాంటి బ్లడ్‌ ప్రెషర్‌ కానీ.. డయాబెటిస్‌ కానీ లేవన్నారు. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత నుంచి ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలయ్యిందని.. దీనితో జైలు అధికారులపై అనుమానాలు తలెత్తుతున్నాయని మషాల్‌ యుసుఫ్‌జాయ్‌ అన్నారు.

 

ఇవి కూడా చదవండి: