Afghanistan: ఆఫ్గానిస్తాన్‌లో బాలికల హక్కులను కాలరాస్తున్న తాలిబన్లు.. ఐరాస ఆందోళన
తాలిబన్ల పాలనలో ఆఫ్గానిస్తాన్‌లో మహిళలు, బాలికల పరిస్థితి దారుణంగా తయారైందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. బాలికల ఆశలతో పట్ల ఆఫ్గానిస్తాన్ శ్మశాన వాటికలా తయారైందని టోలోన్యూస్ వెల్లడించింది. ఇక ఆఫ్గాన్ బాలికలు తమ హక్కుల కోసం ప్రధానంగా విద్య హక్కు కోసం పోరాడుతున్నారు. బాలికల విద్య పట్ల నిషేధం ఉన్నా బాలికలు మాత్రం తమ హక్కు కోసం పోరాడుతున్నారని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం వెల్లడించింది.
Afghanistan: తాలిబన్ల పాలనలో ఆఫ్గానిస్తాన్‌లో మహిళలు, బాలికల పరిస్థితి దారుణంగా తయారైందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. బాలికల ఆశలతో పట్ల ఆఫ్గానిస్తాన్ శ్మశాన వాటికలా తయారైందని టోలోన్యూస్ వెల్లడించింది. ఇక ఆఫ్గాన్ బాలికలు తమ హక్కుల కోసం ప్రధానంగా విద్య హక్కు కోసం పోరాడుతున్నారు. బాలికల విద్య పట్ల నిషేధం ఉన్నా బాలికలు మాత్రం తమ హక్కు కోసం పోరాడుతున్నారని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం వెల్లడించింది. గురువారం నాడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను ఐక్యరాజ్య సమితి గుర్తు చేసింది. ప్రతి ఏడాది ఏప్రిల్ నాలుగో వారంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటారు. ఐసీటీ అంటే (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ) మహిళా సాధికారికత కోసం కృషి చేసిన వారిని గౌరవిస్తుందని టోలో న్యూస్ పేర్కొంది.
బాలికల చదువుపై ఆంక్షలు..(Afghanistan)
ఆఫ్గానిస్తాన్ లో ఆగస్టు 15, 2021లో తాలిబన్లు రెండోసారి ఇక్కడ అధికారం చేపట్టారు. వచ్చి రాగనే వారు మహిళా యూనివర్శిటిలను మూసివేశారు. బాలికలకు ఆరవ తరగతి వరకు మాత్రమే చదువుకోవడానికి అనుమతించారు. ఆరవ తరగతి దాటిన బాలికలకు విద్యను నిషేధించింది. జాతీయంగా.. అంతర్జాతీయంగా తాలిబన్లపై పెద్ద ఎత్తు విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా బాలికల పాఠశాలలను మూసివేశారు. బాలికల విద్యపై పూర్తిగా నిషేధం విధించారు. అంతే కాకుండా మహిళలు ఉద్యోగాలు చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. మహిళల హక్కులను పూర్తిగా కాలరాశారు. మొత్తానికి చూస్తే బాలికలు, మహిళలు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు తాలిబన్లు.
తాలిబన్లు అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది. స్కూళ్ల తిరిగి ప్రారంభిస్తామని కానీ.. ఆరవ తరగతి తర్వాత పై తరుగతులు చదువుకోవడానికి అనుమతిస్తామని కానీ.. ఎలాంటి ప్రకటన చేయలేదు. రోజు రోజుకు ఆఫ్గానిస్తాన్‌పై తాలబన్ల పట్టు మరింత పెరిగిపోతోంది. మరో పక్క దేశంలో మానవతా సంక్షోభం మరింత ముదురుతోంది. రోజు రోజుకు పరిస్థితులు మాత్రం దారుణంగా తయారవుతున్నాయి. దేశంలో మౌలిక సదుపాయాలు కుప్పకూలాయి. నిత్యావసర సేవలకు ఆటంకం ఏర్పడింది. దేశంలో కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. మానవతా సంస్థలు వీరికి సాయం అందించడానికి నిధుల సేకరించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరో పక్క భద్రతా పరమైన ఇబ్బందులతో పాటు రవాణా ఇబ్బందులు తోడయ్యాయి. ఇక తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికల విద్యపై నిర్భంధం విధించడం వల్ల ఒక తరం బాలికలు విద్యకు నోచుకోకుండా పోతారు. ఒకవైపు పేదరికం..మరో వైపు అసమానతలతో ఇక్కడి మహిళలు, బాలికలు మనోవేదన అనుభవిస్తున్నారు ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది.