Last Updated:

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. అరవింద్ కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్సీ కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు.మే 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వీరిద్దిరిని వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా తన ముందు హాజరుపరచాలని రౌస్ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తీహార్ జైలు అధికారులను ఆదేశించారు.

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. అరవింద్ కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్సీ కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు.మే 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వీరిద్దిరిని వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా తన ముందు హాజరుపరచాలని రౌస్ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తీహార్ జైలు అధికారులను ఆదేశించారు.

పెండింగ్ లో బెయిల్ పిటిషన్లు..(Delhi Liquor Case)

మార్చి 21న అరెస్టు చేయబడిన కేజ్రీవాల్ తన అరెస్టు, ప్రశ్నించడం మరియు బెయిల్ మంజూరుకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటునుసవాలు చేశారు.కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రక్రియను వక్రీకరించడానికి పీఎంఎల్ఏ కింద ఏకపక్ష విధానాన్ని ఉపయోగించారని ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీ మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందా లేదా అనే అంశంతో సహా పలు అంశాలను ఈ పిటిషన్‌లో కేజ్రీవాల్ లేవనెత్తారు. మరోవైపు ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది.ఆప్ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవినీతి జరిగిందని సీబీఐ విచారణ చేస్తుండగా, మనీలాండరింగ్ అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.ఈడీ కేసులో కవిత మధ్యంతర బెయిల్‌ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె ప్రధాన బెయిల్ పిటిషన్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.