Last Updated:

KTR: దీక్షా దివస్ సందర్బంగా రక్తదానం చేసిన కేటీఆర్

తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటికి 15 ఏళ్లు అయిన సందర్బంగా నాటి చైతన్యాన్ని గుర్తు తెచ్చుకుందామని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సచ్చుడో , తెలంగాణ వచ్చుడో అని నినదించిన నేత కేసీఆర్ అని అన్నారు.

KTR: దీక్షా దివస్ సందర్బంగా రక్తదానం చేసిన కేటీఆర్

KTR: తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటికి 15 ఏళ్లు అయిన సందర్బంగా నాటి చైతన్యాన్ని గుర్తు తెచ్చుకుందామని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సచ్చుడో , తెలంగాణ వచ్చుడో అని నినదించిన నేత కేసీఆర్ అని అన్నారు. 2009 నవంబర్ 29 చారిత్రక దినం అని రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. దీక్షా దివస్ సందర్బంగా తెలంగాణ భవన్‌లో రక్త దాన శిబిరాలు నిర్వహించారు.

సీపీ అభ్యంతరం..(KTR)

అంతకు ముందు దీక్షా దివస్ గురించి తెలియడంతో ఎన్నికల కమిషన్ స్క్వాడ్ తెలంగాణ భవన్‌ వద్దకు చేరుకుంది. కార్యక్రమం వివరాలని తెలుసుకున్నారు. బిఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులు ఎన్నికల కమిషన్ స్వ్కాడ్‌తో చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, న్యాయవాది సోమభరత్ సీపీతో మాట్లాడినా అనుమతి లభించలేదు. దీక్షాదివస్ కార్యక్రమాలు చేయవద్దని సీపీ సందీప్ శాండిల్య తేల్చి చెప్పారు. 144సెక్షన్ అమలుకు పోలింగ్ కేంద్రానికి 200మీటర్ల దూరంలో భవన్ లేదని, 14సంవత్సరాలుగా దీక్షాదివస్ చేస్తున్నామని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చెప్పారు. అయితే భవన్ లోపల కార్యక్రమాలు చేసుకోవాలని సీపీ సందీప్ శాండిల్య సూచించారు.