Last Updated:

UK Couple: హోటల్ బిల్లు ఎగ్గొట్టడంలో ఈ బ్రిటన్ జంట దిట్ట!

ఖరీదైన హోటళ్ల లో ఖరీదైన భోజనం పీకలదాకా తిని బిల్లు చెల్లించకుండా పారిపోయే బాపతు వారు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. తాజాగా బ్రిటన్‌లో ఇలాంటి ఘటనే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక జంట ఐదు రెస్టారెంట్లలో ఖరీదైన భోజనం తిని సుమారు వెయ్యి పౌండ్లు వరకు చెల్లించకుండా పారిపోయింది.

UK Couple: హోటల్ బిల్లు ఎగ్గొట్టడంలో ఈ  బ్రిటన్ జంట దిట్ట!

UK Couple: ఖరీదైన హోటళ్ల లో ఖరీదైన భోజనం పీకలదాకా తిని బిల్లు చెల్లించకుండా పారిపోయే బాపతు వారు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. తాజాగా బ్రిటన్‌లో ఇలాంటి ఘటనే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక జంట ఐదు రెస్టారెంట్లలో ఖరీదైన భోజనం తిని సుమారు వెయ్యి పౌండ్లు వరకు చెల్లించకుండా పారిపోయింది. ఇండియాన్‌ కరెన్సీ ప్రకారం సుమారు లక్షా నాలుగు వేల రూపాయల వరకు ఉంటుంది. ఎట్టకేలకు పోలీసులు పట్టుకొని కటకటాల పాలు చేశారు. వచ్చే నెల జంటను కోర్టులో హాజరపర్చనున్నారు. కాగా ఈ జంటపై .. డౌన్‌ అండ్‌ డ్యాష్‌ ఫ్రాడ్‌ కింద కేసు నమోదు చేశారు. అయితే సోషల్‌ మీడియాలో ఈ జంట గురించి హోటల్‌ యజమానులు పోస్టులు పెట్టిన పోలీసులు మాత్రం దీన్ని తేలికగా తీసుకున్నారు. అంత అర్జంట్‌ కేసు కాదని పెద్ద సీరియస్‌గా దృష్టి పెట్టలేదు.

సోషల్‌ మీడియాలో వైరల్ అవడంతో..(UK Couple)

సోషల్‌ మీడియాలో ఈ జంట గురించి పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఎట్టకేలకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. రెస్టారెంట్‌ యజమానుల ఆరోపణల విషయానికి వస్తే.. ఈ జంట ఖరీదైన భోజనం ఆర్డర్‌ చేసి తిని బిల్లు చెల్లించకుండా పారిపోతారని పలువురు హోటల్‌ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. బ్రిటన్‌కు చెందిన మెట్రో పత్రిక సమాచారం ప్రకారం ఈ జంట వేల్స్‌లోని సాండ్‌ఫీల్డ్స్‌లోని పోర్ట్‌ టాల్‌బోట్‌కు చెందిన వారని తెలిపింది. ఈ జంట ఐదు రెస్టారెంట్లలో భోజనం చేసి వెయ్యి పౌండ్ల వరకు చెల్లించకుండా ఎగ్గొట్టి పారిపోయారని తెలిపింది. ఇక ఈ జంట విషయానికి వస్తే 39 ఏళ్ల ఆన్ మెక్‌డొనాగ్, 41 ఏళ్ల బెర్నాడ్‌ మెక్‌డొనాగ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ జంట పోలీసుల కస్టడీలో ఉన్నారు. వచ్చే నెలలో కోర్టులో హాజరు పర్చనున్నారు. కాగా ఆన్‌ మెక్‌డొనాగ్‌పై నాలుగు కౌంట్ల దొంగతనం కేసును నమోదు చేశారు. ఇంతకు ఈ జంట విషయం బయటపడ్డానికి ప్రధాన కారణం సోషల్‌మీడియా అని చెప్పాలి. హోటల్‌ యజమానులు తమ హోటల్‌లో భోజనం చేసి బిల్లు చెల్లించకుండా పారిపోయారని వారిని గుర్తించి పట్టించడానికి సహకరించాలని సోషల్‌ మీడియాలో హోటల్‌ సీసీ పుటేజ్‌ను పెట్టారు. దీంతో పాటు రెస్టారెంట్‌ యజమానులతో పాటు మేనేజర్లు పోలీసులను సంప్రదించారు.. అయినా వారి నుంచి సరైన స్పందన లభించలేదు. దీన్ని తాము అత్యవసర కాల్‌గా చూడలేదని పోలీసులు చెప్పుకొచ్చారు.

అయితే ఒక రెస్టారెంట్‌ యజమాని సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు ప్రకారం…ఈ జంట రెస్టారెంట్‌లో ఖరీదైన భోజనం ఆర్డర్‌ చేస్తారు. వెంటనే భోజనం చేసిన తర్వాత నలుగురు గ్రూపు గల సభ్యులు కన్ను మూసి తెరిచేలోగా బిల్లు చెల్లించకుండా పారిపోతారని చెప్పారు.అయితే ఆన్‌ మెక్‌డొనాగ్‌తో పాటు చిన్న పిల్లవాడిని బిల్లు చెల్లిస్తారని వదిలేస్తారు. అయితే బిల్లింగ్‌ కౌంటర్‌ దగ్గరి వచ్చే సరికి ఆమె కార్డు తీసి ఇస్తుంది. కాగా కార్డు చెల్లుబాటు కాదు డిక్లైన్‌ అని వస్తుంది. దీంతో ఆమె కారులో మరో కార్డు ఉందని చెప్పి వెళిపోతుంది. రెస్టారెంట్‌ యజమాని పిల్లవాడిని ఇక్కడే ఉంచాలని కోరుతారు. పది సెకన్లలో పిల్లాడు కూడా పరుగు పరుగున కారు వద్ద పరుగులు తీస్తాడు. ఇద్దరు కలిసి కారులో ఊడాయిస్తారు. కాగా సౌత్‌వెల్స్‌ పోలీసులు మాత్రం ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉందని చెప్పారు.