Last Updated:

Missing Case : తెనాలిలో ఒకే రోజు నలుగురు పిల్లల మిస్సింగ్.. చివరికి ఏమైందంటే ?

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో నిన్న ఒక్కరోజే నలుగురు పిల్లలు కనిపించకుండా పోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. కాగా ఈ కేసుని సవాలుగా తీసుకున్న పోలీసులు అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో చివరకు ఆ పిల్లల ఆచూకీ లభించి వారిని తల్లిదండ్రులకు అప్పగించడంతో

Missing Case : తెనాలిలో ఒకే రోజు నలుగురు పిల్లల మిస్సింగ్.. చివరికి ఏమైందంటే ?

Missing Case : ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో నిన్న ఒక్కరోజే నలుగురు పిల్లలు కనిపించకుండా పోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. కాగా ఈ కేసుని సవాలుగా తీసుకున్న పోలీసులు అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో చివరకు ఆ పిల్లల ఆచూకీ లభించి వారిని తల్లిదండ్రులకు అప్పగించడంతో అందించడంతో ఆ మిస్సింగ్ కథ సుఖాంతంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చినరావూరు తోట పోతురాజు కాలనీలో నివాసం ఉండే పంది మాల్యాద్రి – లతల కుమార్తె రాధిక (13), కుమారుడు రాఘవేంద్ర (8) శుక్రవారం ఉదయం నుంచి కనిపించడం మానేశారు. మాల్యాద్రి దంపతులు ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందినవారు. గత ఆరునెలల నుంచి కూలి పనుల నిమిత్తం పోతురాజు కాలనీలో నివాసముంటున్నారు. ఇక నిన్న కూడా యధావిధిగా కూలీ పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి వారి పిల్లలిద్దరూ కనిపించకుండా పోయారు. అలానే 14వ వార్డు చినరావూరు తోట స్మశానం రోడ్డు ప్రాంతానికి చెందిన షేక్ జానీ కుమారుడు అల్తాఫ్ (9), షేక్ బాషా కుమారుడు ఆరిఫ్ (7) కూడా కనిపించకుండా పోయారు.

ఇలా ఒకే ప్రాంతానికి చెందిన నలుగురు పిల్లలు అదృశ్యం కావడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. దాంతో పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయారు. ఈ క్రమంలో అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ లభించింది. అందులో ముగ్గరు చిన్నారులు విజయవాడ లో ఓ పార్కులో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. ఇలా విజయవాడ నుంచి తెనాలి తీసుకువచ్చేందుకు వెళ్ళినట్లు సమాచారం అందుతుంది.