Last Updated:

AP assembly: ఏపి అసెంబ్లీకి వెళ్లిన ఎంపీ పిఏ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పబ్లిక్ ప్లేస్ గా మారింది. అధికార పార్టీ పోలీసింగ్ గా భావిస్తున్న ప్రతిపక్షాలకు అవుననే సమాధానం పోలీసుల నుండే ఎదురైంది. ఓ ఎంపీ కారు ప్రతిపక్ష శాసనసభ్యులు చూస్తుండగానే దర్జాగా లోపలకు పోవడంతో ఈ విషయం బయటపడింది

AP assembly: ఏపి అసెంబ్లీకి వెళ్లిన ఎంపీ పిఏ

AP Assembly: వివరాల్లోకి వెళ్లితే…ఏపి అసెంబ్లీ సమావేశాలు నేటి ప్రారంభమైనాయి. దీంతో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అసెంబ్లీ గేటు వద్దకు చేరుకొన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు డోల వీరాంజనేయ స్వామి, బెందాళం అశోక్ కార్లను పోలీసులు ఆపారు. అదే సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి కారును పోలీసులు అసెంబ్లీకి అనుమతించారు. దీంతో తెదేపా ఎమ్మెల్యేలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

ఎమ్మెల్యేల కారును ఆపి విజయసాయి కారును ఎలా లోనికి అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. వైసీపి ఎంపీ వాహనంలో లేరని ఆయన పీఏ మాత్రమే ఉన్నారని పోలీసులు నింపాదిగా చెప్పడంతో టీడీపి ఎమ్మెల్యేలు మరింతగా రెచ్చిపోయారు. ఏంటి ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ మర్చిపోతే పిఏను లోనికి పంపామని టీడీపి ఎమ్యెల్యేలకు సర్ధి చెప్పేందుకు పోలీసు అధికారులు ప్రయత్నించారు. ఇది మంచి పద్ధతి కాదని తెదేపా శాసనసభ్యులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: