Rain Alert: ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు

Big Rain Alert to AP People Heavy Rain in Today and Tomorrow: ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కురవనున్నట్లు తెలిపింది. గంటలకు 50 నుంచి 60 కి.మీల వేగంతో ఈదురుగాలుుల వీయనున్నట్లు పేర్కొంది. అలాగే , నంద్యాల జిల్లాలోని పసుపులలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అదే విధంగా, కాకినాడ, విశాఖపట్నం, అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు, బాపట్ల, కర్నూల్, నంద్యాల, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే ఛాన్ష్ ఉందని తెలిపింది.