Last Updated:

Maharashtra: నదిలో గుట్టలుగా చిన్నారుల శవాలు.. భయాందోళనలో గ్రామస్థులు

మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. పసికందులు నదిలో శవాలై కనిపించారు. వాన్ నదిలో గుట్టులుగుట్టలుగా శిశుల మృతదేహాలు కనిపించడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Maharashtra: నదిలో గుట్టలుగా చిన్నారుల శవాలు.. భయాందోళనలో గ్రామస్థులు

Maharashtra: మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. పసికందులు నదిలో శవాలై కనిపించారు. వాన్ నదిలో గుట్టులుగుట్టలుగా శిశుల మృతదేహాలు కనిపించడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

మహారాష్ట్రలోని వాన్ నదిలో గుట్టలుగుట్టలుగా శిశువుల మృతదేహాలు కనిపించిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ముక్కుపచ్చలారని చిన్నారులు నదిలో శవాలై కనిపించారు. బుల్దానా జిల్లా సంగ్రామ్‌పూర్ తాలూకా కొలాడ్ గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ ఘటన యావత్ దేశప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. తమ్‌గావ్ పోలీసులు సమాచారం అందుకుని విచారణ చేపట్టగా వారికి నమ్మశక్యం కానీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమ అబార్షన్ రాకెట్ నడుస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గిరిజనుల ప్రాబల్య ప్రాంతాల్లో బోగస్ వైద్యులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారని స్థానికులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి వైద్యులే ఎక్కువగా అక్రమ అబార్షన్ రాకెట్‌ను నడుపుతున్నారని, అలా మరణించిన శిశువులను నదిలో పడేస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ విషయమై తమ్‌గావ్ పోలీసులు విచారణ మొదలు పెట్టారు. సెక్షన్ 318 కింద కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలో అబార్షన్ రాకెట్ పై చర్యులు తీసుకుంటామని అక్కడి గ్రామస్థులకు ధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం దీనిపై ఇంతవరకూ స్పందింలేదు.

ఇదీ చదవండి: “నువ్వు నా భార్యవి అవుతావా” అంటూ 14 ఏళ్ల బాలుడి ఇన్ స్టా స్టేటస్

ఇవి కూడా చదవండి: