Home / Maharashtra
మహారాష్ట్రలోని ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తన వైకల్య ధృవీకరణ పత్రాన్ని పొందేందుకు పూణెలో నకిలీ చిరునామాను సమర్పించారు. 'వైకల్య ధృవీకరణ పత్రం' అధికారికంగా యశ్వంతరావు చవాన్ మెమోరియల్ హాస్పిటల్, పింప్రి ద్వారా జారీ చేయబడింది.
మరోమారు ఉల్లిధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉల్లికి ప్రధానమార్కెట్ మహారాష్ర్ట.. ఇక్కడి లాసన్‌గావ్ మండిలో సరాసరి ఉల్లిధర సోమవారం నాడు కిలో రూ.26లు పలికింది. అంతకు ముందు అంటే మే 25న ఉల్లిధర కేవలం రూ.17 మాత్రమే
ముంబైలో హోర్డింగ్ జారిపడిన ఘటనలో 14 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతంలోని పెట్రోల్ పంపు పక్కన ఉన్న 100 అడుగుల హోర్డింగ్ తుఫాను గాలులకు కిందకు పడిపోవడంతో దీనికింద ఉన్న కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కార్లలో పలువురు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ర్టలో సుడి గాలి పర్యటన చేస్తున్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం ఉత్తర మహారాష్ర్ట లోని నందుర్బార్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
లోక్ సభ మూడవ విడత పోలింగ్‌కు గడువు దగ్గరపడుతోంది. ఓటర్లు రాజకీయ నాయకులను తమ సమస్యలను తీరిస్తేనే ఓట్లు వేస్తామని బెట్టు చేస్తున్నారు. ఇక తాజా ఉదంతం విషయానికి వస్తే మహారాష్ర్టలోని సాంగ్లీ జిల్లాను తీసుకుంటే ఇక్కడ పలు తాలూకాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోనే అతి పొడవైన సీ బ్రిడ్జిని ముంబైలో ప్రారంభించారు. కాగా ఈ బ్రిడ్జికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి పెట్టారు. 21.8 కిలోమీటర్ల ఆరులేన్ల బ్రిడ్జికి 18వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. ఒక లక్షా 77వేల 903 మెట్రలిక్ టన్నుల ఉక్కును వినియోగించారు.
శుక్రవారం మహారాష్ట్రలోని నాసిక్‌లోని కాలరామ్ ఆలయంలో జరిగిన 'స్వచ్ఛత అభియాన్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు దేశవ్యాప్తంగా దేవాలయాల వద్ద స్వచ్ఛతా కార్యక్రమాలు (క్లీన్‌నెస్ డ్రైవ్‌లు) నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్రలోని థానేలో తన ప్రియుడు కారుతో తనను ఢీకోట్టడానికి ప్రయత్నించడంతో తీవ్రంగా గాయపడినట్లు ప్రియా సింగ్ అనే యువతి తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో బ్యూరోక్రాట్ కొడుకు అయిన తన బాయ్‌ఫ్రెండ్ తనను కొట్టి, గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడని ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో తెలిపింది.
:ఐసిస్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కర్ణాటక మరియు మహారాష్ట్రలోని 44 చోట్ల దాడులు నిర్వహించి మొత్తం 15 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.ఈ ఉదయం నుంచి ఎన్ఐఏ దాడులు చేస్తున్న మొత్తం 44 ప్రాంతాల్లో కర్ణాటకలో 1, పూణెలో 2, థానే రూరల్‌లో 31, థానే సిటీలో 9, భయందర్‌లోని 1 చోట ఎన్ఐఏ సోదాలు చేసినట్లు సమాచారం.
రైతుల పేరుతో కొందరు రాజకీయాలు చేశారంటూ ప్రధాని మోదీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేసారు. గురువారం షిర్డీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రకు చెందిన ఓ నాయకుడు చాలా ఏళ్లుగా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కాని రైతులకు ఏం చేశాడు? అంటూ ప్రశ్నించారు.