Maoists Camps Collapsed: మావోయిస్టుల శిబిరాలు ధ్వంసం..!

Maoists Camps Collapsed in Maharashtra – Chhattisgarh: మహారాష్ట్రా – చత్తీస్ఘడ్ సమీపంలో మావోయిస్టుల శిబిరాన్ని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. కావండే సమీపంలో భమెరాగడ్ మావోయిస్టులు దళం శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. భద్రతా దళాలను గమనించిన మావోలు కాల్పులు మొదలు పెట్టారు. ఈ ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. మావోల శిబిరం దగ్గర ఏకే 47, రెండు ఆయుధాలు.. డీటోనేటర్లు, ఇతర సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
భామ్రాగడ్ లో మావోయిస్టులు శిభిరాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారంతో c60కమాండోలు రంగంలోకి దిగారు. సోమవారం సాయంత్రం మావోయిస్టులకు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. రెండు గంటల వ్యవథిలో ఇదే అటవీ ప్రాంతంలోవేర్వేరు చోట్ల మూడు సార్లు ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. మావోలు తప్పించుకున్నారు. ఘటనా స్థలంలో ఒకINSAS, ఒక సింగిల్ షాట్ రైఫిల్, ఒక మ్యగజైన్, డినోటర్లుతో పాటు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మావోయిస్టుల శిభిరాన్ని బలగాలు ద్వంసం చేశారు.
బీజాపూర్ వైపు మావోయిస్టుల కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.మావోయిస్టులు గ్రూప్లుగా విడిపోయి కర్రెగుట్టలను వదిలివెళ్తున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. బీజాపూర్ జిల్లా శివారు లంకపల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.సెర్చ్ ఆపరేషన్లో భాగంగా 24 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు.