Last Updated:

Twitter: కష్టపడి పనిచెయ్యండి లేదంటే ఇంటికెళ్లండి.. ఉద్యోగులకు మస్క్ మెయిల్స్

ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి మస్క్ అనేక రకాల మార్పులు చేర్పులతో అటు ఉద్యోగులకు ఇటు యూజర్లకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇకపోతే తాజాగా ట్విట్ట‌ర్ 2.0ను నిర్మించేందుకు ఉద్యోగులు అహర్నిశలు శ్ర‌మించాల‌ని సుదీర్ఘ ప‌నిగంట‌లు చేయాల్సి ఉంటుందని ఆయన ట్విట్టర్ ఉద్యోగులకు తెలిపారు.

Twitter: కష్టపడి పనిచెయ్యండి లేదంటే ఇంటికెళ్లండి.. ఉద్యోగులకు మస్క్ మెయిల్స్

Twitter: ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి మస్క్ అనేక రకాల మార్పులు చేర్పులతో అటు ఉద్యోగులకు ఇటు యూజర్లకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇకపోతే తాజాగా ట్విట్ట‌ర్ 2.0ను నిర్మించేందుకు ఉద్యోగులు అహర్నిశలు శ్ర‌మించాల‌ని మైక్రోబ్లాగింగ్ సైట్ అధినేత ఎల‌న్ మ‌స్క్ కోరారు. సుదీర్ఘ ప‌నిగంట‌లు చేయాల్సి ఉంటుందని ఆయన ట్విట్టర్ ఉద్యోగులకు తెలిపారు. ఉద్యోగులంతా గురువారంలోగా ఇందుకు అంగీక‌రించాల‌ని లేనిప‌క్షంలో వారికి మూడు నెల‌ల వేత‌నంతో కూడిన ప‌రిహార ప్యాకేజ్‌తో ఇంటికి సాగ‌నంపుతామ‌ని మ‌స్క్ తేల్చిచెప్పారు.

ఈ పోటీ ప్ర‌పంచంలో మ‌న‌గ‌లిగేందుకు మ‌నం క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని, ట్విట్టర్ 2.0 నిర్మించిందేకు ఎక్కువ ప‌నిగంట‌లు తీవ్రంగా శ్ర‌మించాల్సిన అవ‌సరం ఉంద‌ని మ‌స్క్ తన ఉద్యోగుల‌కు ఈమెయిల్‌ ద్వారా స్ప‌ష్టం చేశారు. అద్భుత సామ‌ర్ధ్యం క‌న‌బ‌రిస్తేనే ఈ రేసులో మనం రాణించగలమని అన్నారు. ట్విట్ట‌ర్‌లో డిజైన్‌, ప్రొడ‌క్ట్ మేనేజ్‌మెంట్ కీల‌క‌మ‌ని, మెరుగైన కోడ్ రాసేవారు సైతం మ‌న టీంలో అధికంగా ఉన్నార‌ని మెయిల్ లో చెప్పుకొచ్చారు.

మీరు స‌రికొత్త ట్విట్ట‌ర్‌లో పాలుపంచుకోవాలంటే మొయిల్ ఇచ్చిన లింక్‌లో ఉన్న ఫాంను గురువారంలోగా నింపాల‌ని కోరారు. ఈ ప‌ని చేయ‌ని వారు మూడు నెల‌ల వేత‌నం తీసుకుని కంపెనీ నుంచి వైదొలుగుతారని ఆయన తేల్చి చెప్పారు. ఇక మీరు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా ట్విట్ట‌ర్‌ను బ‌లోపేతం చేసేందుకు ఇన్నాళ్లూ మీరు చేసిన కృష‌కి ధ‌న్య‌వాదాలంటూ మ‌స్క్ ఉద్యోగుల‌కు పంపిన ఈమెయిల్‌లో రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: మస్క్ ఛార్జీల మోత మళ్లీ షురూ.. ఈనెల 29 నుంచి బ్లూటిక్ సేవలు పునరుద్ధరణ

ఇవి కూడా చదవండి: