GT vs SRH IPL 2025: గెలిచిన గుజరాత్, హైదరాబాద్ ‘ప్లే ఆఫ్స్’ గల్లంతు

GT vs SRH: గుజరాత్ 38పరుగుల తేడాతో హైదరాబాద్ పై గెలిచింది. శుక్రవారం గుజరాత్ చేతిలో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు దాదాపు చేజారిపోయాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణిత 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 224పరుగులు చేసింది.
శుభ్ మన్ గిల్ 38బంతుల్లో 76, జోస్ బట్లర్ 37బంతుల్లో 64, సాయి సుదర్శన్ 23బంతుల్లో 48 పరుగులు సాధించి పటిష్టమైన ఆరంభాన్ని అందించారు. ఈ సీజన్ లో ఫామ్ లో ఉన్న గిల్ బ్యాట్ తో మెరిపించాడు. దీంతో 6వికెట్ల నష్టానికి 224పరుగులను గుజరాత్ టైటాన్స్ చేసింది. హైదరాబాద్ బౌలర్లలో ఉనద్కత్ 3వికెట్లు తీశాడు.
చేజింగ్ లో భాగంగా హైదరాబాద్ స్టర్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఆరంభం నుంచే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. హెడ్ 16బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఆతర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (13) తడబడ్డాడు. అభిషేక్ కు క్లాసెన్ తోడవడంతో స్కోరు బోర్డు ఉరకలు వేసింది. అభిషేక్ సిక్సర్లతో విరుచుకుపడటంతో పవర్ ప్లే లో 57పరుగులు వచ్చాయి. అభిషేక్, క్లాసెక్ 33 బంతుల్లో 57పరుగులు జతచేశారు.
వీరిద్దరూ ఉన్న ఫామ్ లో 31బంతుల్లో 86పరుగులు చేయాల్సి ఉండగా సాధ్యమేననిపించింది. వరుస ఓవర్లలో ఇద్దరూ అవుట్ అయ్యారు. చివర్లో నితీష్ 10 బంతుల్లో 21 ప్యాట్ కమిన్స్ 10 బంతుల్లో 19 నాటౌట్ గా నిలిచాడు. దీంతో 38పరుగుల తేడాతో హైదరాబాద్ పై గుజరాత్ విజయం సాధించింది. దీంతో సన్ రైజర్స్ కు ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి.
ఈసిరీస్ లో గుజరాత్ ఇప్పటివరకు 7 మ్యాచులు గెలువగా, హైదరాబాద్ 7 మ్యాచులు ఓడిపోయింది.
Gujarat: సుదర్శన్ (సి) క్లాసెన్ (బి) అన్సారీ 48; గిల్ (రనౌట్) 76; బట్లర్ (సి) అభిషేక్ (బి) కమిన్స్ 64; సుందర్ (సి) నితీశ్ రెడ్డి (బి) ఉనాద్కట్ 21; షారుఖ్ (నాటౌట్) 6; తెవాటియా (సి) అనికేత్ (బి) ఉనాద్కట్ 6; రషీద్ (సి) అండ్ (బి) ఉనాద్కట్ 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 224.
వికెట్ల పతనం: 1-87, 2-149, 3-206, 4-218, 5- 224, 6-224. బౌలింగ్: షమీ 3-0-48-0, ఉనాద్కట్ 4-0-35-3, కమిన్స్ 4-0-40-1, హర్షల్ 3-0-41-0, అన్సారీ 4-0-42-1, కమిందు 2-0-18-0.
Hyderabad: హెడ్ (సి) రషీద్ (బి) ప్రసిద్ 20; అభిషేక్ (సి) సిరాజ్ (బి) ఇషాంత్ 74; ఇషాన్ కిషన్ (సి) ప్రసిధ్ (బి) కొయెట్టీ 13; క్లాసెన్ (సి) బట్లర్ (బి) ప్రసిద్ 23; అనికేత్ (సి) షారుఖ్ (బి) సిరాజ్ 3; నితీశ్ రెడ్డి (నాటౌట్) 21; కమిందు (సి) బట్లర్ (బి) సిరాజ్ 0; కమిన్స్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 186.
వికెట్ల పతనం: 1-49, 2- 82, 3-139, 4-141, 5-145, 6-145, బౌలింగ్: సిరాజ్ 4-0-33-2, ఇషాంత్ 3.2-0-35-1, ప్రసిధ్ 4-0-19-2, కొయెట్జ్ 4-0-36-1, సుందర్ 1-0-6-0, రషీద్ 3-0-50-0, సాయికిషోర్ 0.4-0-1-0.