Last Updated:

High Court : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్ సంతోష్, జగ్గు స్వామికి హైకోర్టులో ఊరట

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీఎల్ సంతోష్ తో పాటు, జగ్గు స్వామికి హైకోర్టులో ఊరట లభించింది.

High Court : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..  బీఎల్ సంతోష్,  జగ్గు స్వామికి హైకోర్టులో ఊరట

Telangana News: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీఎల్ సంతోష్ తో పాటు, జగ్గు స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. 41ఏ crpc నోటీసులపై విచారించిన ధర్మాసనం.. ఈ నెల 13 వరకూ బీఎల్ సంతోష్ స్టేను పొడగించింది. జగ్గుస్వామికి ఈ కేసులో 13తేదీ వరకూ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేస్తూ తీర్పు ప్రకటించింది.

గత నెలలో బీఎల్ సంతోష్ సిట్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 5వ తేదీ వరకు స్టే ఇచ్చింది. నేటితో స్టే ముగియనుంది. దీంతో ఇవాళ ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది.ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కు గత నెలలో సిట్ అధికారులు రెండు దఫాలు నోటీసులు పంపారు.గత నెల 21న విచారణకు రావాలని కోరారు. ఆ తర్వాత హైకోర్టు ఆదేశం మేరకు గత నెల 23న మరోసారి నోటీసులు పంపింది హైకోర్టు. దీనితో ఈ నోటీసులపై తెలంగాణ హైకోర్టులో బీఎల్ సంతోష్ గత నెల 25న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు బీఎల్ సంతోష్ కి సిట్ జారీ చేసిన నోటీసులపై డిసెంబర్ 5 వ తేదీ వరకు స్టే విధించింది.

ఇదే కేసులో తనకు ఇచ్చిన 41సీఆర్‌పీసీ నోటీసులతో పాటు, లుకౌట్ నోటీసులపై స్టే కోరుతూ ఈ నెల 3వ తేదీన జగ్గుస్వామి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ నిర్వహించింది..జగ్గుస్వామికి కూడ సిట్ నోటీసులపై ఈ నెల 13వ తేదీ వరకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి: