Home / Telangana High Court
Telangana High Court Shock to Venu Swamy: ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిషుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళలపై నిశ్చితార్థం తర్వాత వారి జాతకం చెబుతూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి జాతకం అంత బాలేదని, త్వరలోనే వీరు విడాకులు తీసుకుని విడిపోతారని సోషల్ మీడియా వేదికగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో వేణుస్వామిపై వ్యాఖ్యలు తీవ్రదూమారం రేపాయి. ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా […]
Jani Master Got Bail From HC: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. తాజాగా తెలంగాణ హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. కాగా తన దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించాడంటూ నార్సింగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల అతడిపై పోక్సో చట్టం, లైంగిక వేధింపులు కేసు నమోదు చేయగా.. ఈ కేసులో […]
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయింది. వాన్‌పిక్ ఛార్జిషీటు నుంచి అతని పేరును తొలగించేందుకు నిరాకరించిన కోర్టు, అభియోగాలను రద్దు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై దర్యాప్తునకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ల ప్రమాణస్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వీరిచేత ప్రమాణస్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బీఆర్ఎస్ పార్టీ ఎక్సలెన్స్ సెంటర్ కోసం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం హైకోర్టు ఆదేశించింది.కేసీఆర్ తో పాటు అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన వ్యూహం సినిమాకు తెలంగాణ హైకోర్ట్ బ్రేక్ వేసింది. సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జనవరి 11 వరకు సినిమా రిలీజ్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ ను క్యాన్సల్ చేస్తూ తీర్పునిచ్చింది.
Director Raghavendra Rao: చిక్కుల్లో పడ్డ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు . ఆయనకు తెలంగాణా హైకోర్ట్ నుంచి నోటీసులు. ఓభూమికి సబంధిచిన వివాదంలో ఆయనకు నోటీసులు వచ్చినట్టు తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన భూమిని ఆయన సొంత అవసరాలు వాడుకున్నారన్న ఆరోపణలు ఫేస్ చేస్తున్నారు రాఘవేంద్ర రావు.
ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటీషన్ దాఖలు చేశారు. దీనిని పిల్‌గా పరిగణించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది.
తెలంగాణ హైకోర్టు బుధవారం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ( ఎస్‌సిసిఎల్ )లో గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్ ఎన్నికలను డిసెంబర్ 27 కి వాయిదా వేసింది. ఎస్‌సిసిఎల్ చేసిన అప్పీల్‌ను పరిశీలించిన తర్వాత హైకోర్టు తన తీర్పును వెలువరించింది. నవంబర్ 30లోగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది.