Betting App Case- Vishnu Priya: బెట్టింగ్ యాప్ కేసు – హైకోర్టును ఆశ్రయించిన విష్ణు ప్రియ

Anchor Vishnu Priya Approch High Court: యంకర్ విష్ణు ప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. బెట్టింగ్ యాప్ కేసులో తాజాగా ఆమె హైకోర్టులో పిటిషన్ వేసినట్టు సమాచారం. కొద్దిరోజులుగా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన పలువురు సినీ,టీవీ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లు, యూట్యూబర్లపై పంజాగుట్ట, మియాపూర్ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
రానా, విజయ్ దేవరకొండలపై కూడా కేసు
ఇందులో హీరో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మిల పేర్లు కూడా ఉన్నాయి. మొదట పంజాగుట్ట పీఎస్‌లో యాంకర్ విష్ణుప్రియ, రితూ చౌదరి, యూట్యూబర్ టెస్టీ తేజతో పాటు 11 మందిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికేలో యాంకర్ విష్ణుప్రియ, రితూ చౌదరి, యాంకర్ శ్యామలతో పాటు పలువురి పంజాగుట్ట పోలీసులు విచారించారు. శనివారం (మార్చి 22) విష్ణుప్రియను మొదటగా పోలీసులు విచారించిన పోలీసులు మరోసారి విష్ణు ప్రియ విచారణకు రావాలని పేర్కొన్నారు.
హైకోర్టులో పిటిషన్ దాఖలు
బుధవారం (మార్చి 25) ఆమె మరోసారి పంజాగుట్ట పోలీసుల ఎదుట మరోసారి విచారణకు హజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ హైకోర్టు ఆశ్రయించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన ఆమె బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైన రెండు కేసులో ఎఫ్‌ఐఆర్ క్వాష్ చేయాలని పిటిషన్‌లో కోరింది. కాగా నేడు హైకోర్టు విష్ణుప్రియ క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. కాగా బెట్టింగ్ యాప్స్ వల్ల సామాన్య ప్రజలు మోసపోతున్నారని, దానికి అరికట్టేందుకు పోలీసులు బెట్టింగ్ యాప్‌పై జులుం విధిలుస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా సజ్జనార్ ఉద్యమం
పోలీసులకు మద్దతుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌కి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. #saynotobettingapps హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తూ యూత్‌లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన పలువురు సెలబ్రిటీలపై వరుసగా కేసులో నమోదు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. సెలబ్రిటీలు మాటలకు ప్రభావితం అయ్యి దాదాపు 980 మంది బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోయి ప్రాణాలు విడిచారు. దీనిని సీరియస్ తీసుకున్న ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్‌ఫ్లూయేన్సర్లపై వరుసగా కేసులు నమోదు చేసి వారిని విచారిస్తున్నారు.