Sun Transit in May 2025: మే 15న సూర్యుడి రాశి మార్పు.. ఈ రాశుల వారికి ధనయోగం, ఉద్యోగ ప్రాప్తి!

Sun Transit in May 2025: ప్రస్తుతం గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. 2025 మే 15న తెల్లవారుజామున 12:11 గంటలకు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. నిజానికి.. జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని ఆత్మకు కారకంగా పరిగణిస్తారు. సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారిపై సూర్యుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు. దీని కారణంగా సింహ రాశి వారు ప్రతి రంగంలో విజయం , గౌరవాన్ని పొందుతారు కానీ సూర్యుడు తన రాశి మారినప్పుడల్లా.. ఇతర రాశుల వారిపై కూడా తన ఆశీస్సులను కురిపిస్తాడు. మే నెలలో వృషభ రాశిలో సూర్యుని సంచారం కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వ్యక్తులు ఉద్యోగంలో పదోన్నతి , పెట్టుబడిలో ఆర్థిక లాభం పొందుతారు.
సింహ రాశి: సూర్యుడి రాశి మార్పు సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. సూర్యుడి ప్రభావం కారణంగా.. మీరు ప్లాన్ చేసుకున్న పనులు పూర్తవుతాయి. అంతే కాకుండా మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అంతే కాకుండా పెట్టుబడిలో ఆశించిన లాభం మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. అంతే కాకుండా మీరు అనుకున్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయం.
కన్య రాశి: సూర్యుడి సంచారం కన్య రాశి వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది. మీ కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఇంట్లోని పెద్దవారి ఆశీర్వాదా మీకు లభిస్తాయి. మీరు మీ ఆఫీసులో ఉన్నత స్థానాన్ని పొందుతారు. అంతే కాకుండా విద్య, వృత్తిలో మంచి విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. సమాజంలో మీ ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో.. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతం పెరిగే అవకాశం ఉంది.
కుంభ రాశి : మీ ఆఫీసుల్లో సీనియర్ అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇది పురోగతికి అవకాశాలను సృష్టిస్తుంది. అంతే కాకుండా ఆర్థికంగా మీరు బలపడతారు. ప్రేమ వివాహం కోసం చూస్తున్నట్లయితే.. మీరు అనుకున్న పనులు జరుగుతాయి. అంతే కాకుండా సూర్యుని ప్రభావం వల్ల, మీరు తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం. అంతే కాకుండా ఉన్నత స్థానంలో ఉండాలన్న మీ కోరికలు కూడా చాలా బలంగా ఉంటాయి. కొత్త వాహనాలతో పాటు వస్తువులు కొనే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.