Venu Swamy: వేణుస్వామికి హైకోర్టు షాక్ – వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు!
Telangana High Court Shock to Venu Swamy: ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిషుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళలపై నిశ్చితార్థం తర్వాత వారి జాతకం చెబుతూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి జాతకం అంత బాలేదని, త్వరలోనే వీరు విడాకులు తీసుకుని విడిపోతారని సోషల్ మీడియా వేదికగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో వేణుస్వామిపై వ్యాఖ్యలు తీవ్రదూమారం రేపాయి. ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.
అంతేకాదు ఇకపై తాను ఏ సెలబ్రిటీ గురించి మాట్లాడనని పేర్కొన్నారు. అయితే అప్పటికే ఆయనపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో వేణుస్వామి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పటిషన్‌పై విచారించిన హైకోర్టు స్టే విధిస్తూ.. వేణుస్వామిపై చర్యలు తీసుకోవద్దని మహిళా కమిషన్‌ను ఆదేశించింది. అయితే ఇప్పుడు ఆ స్టేను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎత్తివేసింది.
మరోసారి దీనిపై విచారణ చేపట్టిన కోర్టు వేణుస్వామిని విచారించేందుకు మహిళా కమిషన్‌కు అధికారులున్నాయని స్పష్టం చేసింది. అతేకాదు వారం రోజుల్లోగా వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో వేణుస్వామికి బిగ్‌షాక్ తగిలింది. మరి వేణుస్వామిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వేణుస్వామి కమిషన్ విచారణకు హజరవుతారా? లేదా? అనేది ఆసక్తిగా సంతరించుకుంది. కాగా ఈ ఏడాది ఆగష్టు 8న నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కొత్త కాలంగా సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు గప్‌చుప్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికి షాకిచ్చారు.
ఆ వెంటనే వేణు స్వామి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. రేపు శోభిత-నాగచైతన్య నిశ్చితార్థంపై ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్ అదే రోజు సంచలన పోస్ట్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరి జాతకాన్ని వివరిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. అందులో సమంతతో లాగే శోభితతో కూడా నాగచైతన్య విడాకులు తీసుకుంటారని, వీరిద్దరి వైవాహకి బంధం రెండేళ్లు కూడా నిలవదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వగా. వాటిని సవాలు చేస్తూ వేణు స్వామి హైకోర్టులో పటిషల్ దాఖలు చేశారు.