Telangana High Court: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్‌పాల్
Justice Sujoy Paul Appointed as Telangana High Court Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రస్తుతం హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ ఆరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యాారు. కాగా, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల అయ్యాయి. అయితే ఇటీవల సీజేల బదిలీలకు సుప్రీం కొలీజియం సిఫార్లు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, జస్టిస్ సుజయ్ పాల్..1964 జూన్ 21న జన్మించారు. ఆయన బీకాం, ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అనంతరం 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో స్థానం సంపాదించుకున్నారు. అక్కడ పలు బ్యాంకులతో పాటు మానవ హక్కుల కమిషన్, ఇతర బోర్డులకు సేవలు అందించారు.
కాగా, ఆయన 2011లో మధ్యప్రదేశ్ హైకోర్టు అడిషనలల్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో శాశ్వత న్యాయమూర్తిగా నియమించింది. ఆ తర్వాత 2024 మార్చిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చెందారు. తాజాగా, సుప్రీం కొలీజియం సిపార్సులతో తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.