Last Updated:

Telangana High Court BIG Shock to KTR: నాట్ టూ అరెస్ట్ కుదరదని చెప్పిన హైకోర్టు.. ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్!

Telangana High Court BIG Shock to KTR: నాట్ టూ అరెస్ట్ కుదరదని చెప్పిన హైకోర్టు.. ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్!

Telangana High Court BIG Shock to KTR Any Moment KTR will be Arrest: ఫార్ములా ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నాట్ టూ అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ తరఫున న్యాయవాది కోరగా.. ఇలాంటి పిటిషన్లలో నాట్ టూ అరెస్ట్ ఇవ్వడం కుదరదని కోర్టు చెప్పింది.

ఏసీబీ వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల దుర్వినియోగం లేదని కేటీఆర్ తరఫు లాయర్లు వాదించారు. అయితే మనీ ట్రాన్స్‌ఫర్ ఫైల్‌పై కేటీఆర్ సంతకం చేశారని ఏసీబీ చెప్పుకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు నేరపూరిత కుట్ర అంటూ ఏసీబీ అడ్వకేట్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఇందులో 409 సెక్షన్ వర్తించదని కేటీఆర్ తరఫు లాయర్లు చేసిన వాదన సరికాదని ఏసీబీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

కాగా, విచారణ సందర్బంగా ఏసీబీ వాదనలను హైకోర్టు సమర్థించింది. ఫార్ములా ఈ కార్ రేసు ఆపరేషన్ లిమిటెడ్ కేసులో నిధుల మళ్లింపులో ఏం జరిగిందనే విషయాలను పూర్తిస్థాయిలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.హైకోర్టు తీర్పుతో ఏసీబీ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 9న విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు అందించింది. అరెస్ట్ చేయవద్దని చెప్పలేదన్న హైకోర్టు.. కేటీఆర్‌పై అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 409 కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. తాజాగా, హైకోర్టు తీర్పుతో కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ముగిసినట్లే అయింది.

అయితే, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేటీఆర్ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈనెల 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా? ఆయనను అధికారులు అరెస్ట్ చేస్తారా? అనే విషయాలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.