Published On:

Rare Earth Magnet: చైనాతో చిక్కులు.. ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోనుందా?

Rare Earth Magnet: చైనాతో చిక్కులు.. ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోనుందా?

China’s Rare Earth Magnet Curbs Threaten Indian Auto Sector: ఇండియన్‌ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోనుందా? ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే అత్యంత కీలకమైన ఎర్త్‌ మాగ్నెట్‌ విషయానికి వస్తే చైనా సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎర్త మాగ్నెట్‌ మార్కెట్‌లో చైనా 70 శాతం వాటాను ఆక్రమించింది. ఎలక్ట్రిక్ మోటార్లకు ఈ ఎర్త్‌ మాగ్నెట్‌ అత్యంత కీలకం. లేదంటే వాహనాల ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చైనా ఇండియాకు ఎర్త్‌ మాగ్నెట్‌ సరఫరా చేయడానికి బోలెడన్ని షరతులు విధిస్తోంది. దీంతో ఇండియాలో ఎలక్ర్టిక్‌ వాహనాల రంగం సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

 

ప్రస్తుతం చైనాతో అన్నీ దేశాలకు చిక్కులు తప్పడం లేదు. ముఖ్యంగా ఇండియా విషయానికి వస్తే లేని పోని అడ్డంకులు సృష్టిస్తోంది. ఇక ఆటోమొబైల్‌ రంగం విషయానికి వస్తే ఇండియాలో కూడా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెట్రోల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఇక మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఎలక్ర్టిక్‌ ద్విచక్ర వాహనాల అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. వాతావరణంలో కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం దశలవారీగా పెట్రోల్‌ వాహనాలను తగ్గించి వాటి స్థానంలో ఎలక్టిక్‌ వాహనాలను ప్రవేశపెట్టాలని ఇండియన్‌ గవర్నమెంట్‌ భావిస్తోంది. కేవలం ఇండియానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి రానున్నాయి.

 

ఇక ఇండియా విషయానికి వస్తే చైనా నిర్వాకం వల్ల ఇండియన్‌ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోనుంది. ఇక ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీలో కీలకం ఎర్త్‌ మాగ్నెట్‌. కాగా ఈ ఎర్త్‌ మాగ్నెట్‌ మార్కెట్‌ను చైనా కంట్రోల్‌ చేస్తోంది. 70 శాతం గ్లోబల్‌ మార్కెట్‌ను చైనా శాసిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లకు ఈ ఎర్త్‌ మాగ్నెట్‌ తప్పనిసరి. ప్రస్తుతం చైనా నుంచి రావాల్సిన 30 షిప్‌మెంట్లు ఆగిపోయాయి. దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తి రిస్కులోపడే ప్రమాదం ఉంది. ఇక ఇండియా మొత్తం చైనాపై ఆధారపడాల్సి రావడంతో ఇండియన్‌ ఆటో ఇండస్ర్టీస్‌ సంక్షోభంలో కూరుకుపోనుంది. ఇక చైనా ఇండియాకు ఎర్త్‌ మాగ్నెట్‌ సరఫరా చేయాలంటే బోలెడన్నీ కండిషన్లు పెడుతోంది. ఈ ఎర్త మాగ్నెట్‌ ఎందుకు వాడుతున్నారు. వాటి వివరాలు ఇవ్వాలనే షరతు విధించింది.

 

ఇక చైనాకు చెందిన ఈ కీలకమైన ఖనిజాలు క్లీన్‌ఎనర్జీతో పాటు డిఫెఎన్స్‌ టెక్నాలజీ, హై ఎండ్‌ ఎలక్ర్టానిక్స్‌లో విరివిగా వాడుతున్నారు. ఇక చైనా భూగర్బంలో ఈ ఖనిజాలు పుష్కలంగా లభిస్తున్నాయి. దీని ప్రాసెసింగ్‌ కూడా క్లిష్టంగా ఉంటుంది. సాధారణ మాగ్నెట్‌కు వాహనాల్లో వాడే ఎర్త్‌ మాగ్నెట్‌కు చాలా తేడా ఉంటుంది. కాగా ఈ ఖనిజాలు చైనాలో అత్యధికంగా లభిస్తున్నాయి. ఇతర దేశాల్లో పెద్దగా లభించవు. దీంతో చైనా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోంది. కాగా ఈ ఎర్త్‌ మాగ్నెట్‌ విషయానికి వస్తే అత్యంత శక్తిమంతమైన విండ్‌ టర్బైన్స్‌, ఎలక్ర్టిక్‌ వెహికల్‌ మోటార్స్‌కు సోలార్‌ ప్యానెల్‌ విడిభాగాల్లో వినియోగిస్తారు. పేరుకు చిన్న మాగ్నెటే అయినా ఎలక్ర్టానిక్‌ విడిభాగాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. ఇక ఈ ఎర్త్‌ మాగ్నెట్‌ క్లీన్‌ ఎనర్జీలోనే కాకుండా ఎయిరోస్పెస్‌, హెల్త్‌కేర్‌ డివైస్‌లతో పాటు హై ఎండ్‌ ఎలక్ర్టానిక్స్‌లో కూడా విరివిగా వినియోగిస్తారు.

 

ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ లేదా ఐఏఈ అంచనా ప్రకారం గ్లోబల్‌ డిమాండ్‌ గత ఏడాది 93 కిలోటన్నులని తెలిపింది. అయితే 2050 నాటికి దీని డిమాండ్‌ రెట్టింపు అంటే 180 నుంచి 202 కిలో టన్నులకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక దీని డిమాండ్‌ ఇండియన్‌ ఎలక్ర్టిక్‌ వెహికల్స్‌తో పాటు ఆటో ఇండస్ర్టీకి కీలకంగా మారింది. ప్రస్తుతం ఈ ఎర్త్‌ మాగ్నెట్‌ సరఫరా మందగించడంతో ఆటో ఇండస్ర్టీపై తీవ్ర సంక్షోభంలో కూరుకుపోనుంది. పేరుకు చిన్న కాంపోనెంటే అయినా ఈవీ వాహనాల్లో అత్యంత కీలకం కానుంది. ఇక చైనా ప్రభుత్వం ఈ మాగ్నెట్‌ ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో అసలు చిక్కు వచ్చిపడింది. చైనా ఇంతలా ఎగుమగుతులపై ఆంక్షలు విదించడానికి ప్రధాన కారణం అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ట్రంప్‌ అని చెప్పకతప్పదు. ఆయన చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై 145 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తానని హెచ్చరించడంతో చైనా కూడా కౌంటర్‌ ఇవ్వడానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నొక్కడం ప్రారంభించింది.

 

ఇక రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్‌ ను నియోడైమియం, డైస్ప్రోసియం, టెర్బియం, సమారియం నుండి తయారవుతాయి. ఇవి తేలికగా ఉంటాయి కానీ మెరుగైన పని తీరును కనబరుస్తాయి. సంప్రదాయబద్దంగా లభించే మాగ్నెట్‌ల కంటే కూడా బలంగా సమర్ధవంతంగా పనిచేస్తాయి. చూడ్డానికి చిన్నగా ఉన్నా దాని పనితీరు మాత్రం అమోఘం. కార్లను తీసుకుంటే పవర్‌ స్టీరింగ్‌, విండ్‌షీల్డ్‌ వైపర్స్‌, హెడ్‌లైట్స్‌, ఎలక్ర్టిక్‌ విండ్‌ మెకానిజానికి ఈ ఎర్త్‌ మాగ్నెట్‌ను విరివిగా వాడుతారు. ఇక ఎలక్ర్టానిక్‌ కార్ల విషయానికి వస్తే మోటార్లకు తప్పనిసరిగా వాడాల్సిందే. ఇక చైనా విషయానికి వస్తే గ్లోబల్‌ మాగ్నెట్‌ ప్రొడక్షన్‌లో 90 శాతం వాటా ఆక్రమించింది. కాటట్టి చైనా గ్లోబల్‌ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. 2024 ఆర్థికసంవత్సరంలో ఇండియా 460 టన్నుల ఎర్త్‌ మాగ్నెట్‌ను దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది 700 టన్నుల వరకు దిగుమతి చేయాలనుకుంది. ప్రస్తుతం ఆటో కంపెనీలన్నీ ఈవీలకు మారిపోతున్నందున ఎర్త్‌ మాగ్నెట్‌ తప్పనిసరి.. దీనికి ప్రత్యమ్నాయం కూడా లేదు. చైనా సరఫరా చేయ్యలేదంటే ద్విచక్ర వాహన పరిశ్రమల కుప్పకూలే అవకాశాలున్నాయి. అయితే చైనాకు ప్రత్యామ్నాయం గా మలేషియా, వియత్నాం, ఆస్ర్టేలియాలు ఉన్నా ఇంకా పూర్తి స్థాయిలో గనులను అభివృద్ది చేయలేదు. ఇక చైనా విషయానికి వస్తే ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా చౌక కూడా.

 

ఇక చైనా నుంచి ఎర్త్‌ మాగ్నెట్‌ రాలేదంటే ఉత్పత్తి నిలిచిపోతుంది. నిర్వహణా వ్యయం పెరిగిపోతుంది. ఎలక్ర్టిక్‌ వాహనాల ధరలు కనీసం 8 శాతం పెరిగే అవకాశాలున్నాయి. దీంతో కంపెనీల లాభాల మార్జిన్‌ తగ్గిపోతుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల కంపెనీ లాభాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో కంపెనీలు కూడా వాల్యూమ్స్‌ తగ్గించుకోవడంతో పాటు కొత్త ప్రాడక్ట్‌ లాంచింగ్‌లను వాయిదా వేయడమో… అలాగే విస్తరణను కొన్ని రోజుల పాటు నిలిపివేయాలనే ఆలోచనలో ఉన్నాయి. అయితే దీర్ఘకాలంలో ఇండియన్‌ ఆటో ఇండస్ర్టీ ఈవీకి మారడం తప్పనిసరి.. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. సరకు రవాణా క్రమబద్దీకరించడానికి భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు చైనా వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడారు. చైనా ఎర్త్‌ మాగ్నట్‌ సరఫరా నిలిపివేయడంతో ఇండియాలో ఆటోరంగానికి చెందిన షేర్లపై దాని ప్రభావం కనిపించింది.

 

ఇండియాలో ద్విచక్ర వాహనాల్లో అతి పెద్ద కంపెనీ బజాజ్‌ ఆటో ఎండీ రవి బజాజ్‌ కూడా తాజా పరిణమాలపై స్పందించారు. ఎర్త్‌ మాగ్నట్‌ అందుబాటులోకి రాకపోతే జులై నుంచి ఉత్పత్తి నిలిపివేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా బజాజ్‌ ప్రస్తుతం 100 నుంచి 110 సీసీ బైక్‌లను 125 సీసీ అంత ఎక్కువ పవర్‌ కలిగిన బైక్‌లన్నీ ఎలక్ర్టిక్‌ బైక్‌ కిందే ఉత్పత్తి చేస్తున్నాయి. అలాగే త్వరలోనే ఐదు కొత్త చెతక్‌ స్కూటర్‌లను, ఐదు కొత్త ఎలక్ర్టిక్‌ త్రీ వీలర్‌లను రాబోయే నెలల్లో ప్రారంభించాలనుకుంది. ఇటీవల క్యూ4 కాల్‌లో రవి బజాజ్‌ మాట్లాడుతూ చైనా నుంచి రెర్ ఎర్త్‌ మాగ్నట్‌ వల్ల ఉత్పత్తి ప్రభావం కనిపిస్తోందన్నారు. వచ్చే నెల నుంచి ఉత్పత్తిపై నిలిపివేయాల్సి రావచ్చునని కూడా అన్నారు. ఇక టీవీఎస్‌ మోటార్‌ విషయానికి వస్తే జుపిటర్‌, ఎన్‌ టార్క్‌, అపాచీ బైక్‌లన్నీ ఈవీకి చెందినవే. అలాగే ఐ క్యుబే స్కూటర్‌ ఇప్పటి కే రోడ్లపై తిరుగుతోంది. బజాజ్‌ మాదిరగానే ఎర్త్‌ మాగ్నెట్‌ సమయానికి రాకపై ఇబ్బందులు తప్పేలా లేవని కంపెనీ ఎండీ సుదర్శన్‌ వేణు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జూన్‌, జులై నుంచి ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియన్‌ ఆటో ఇండస్ర్టీకి ఇది అతి పెద్ద షాక్‌గా చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఇండియాకు ఇది వేకప్‌ కాల్‌ లాంటిది. భవిష్యత్తులో క్లీన్‌ ఎనర్జీ కోసం …. హైటెక్‌ తయారీ రంగం కోసం కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా ఇతర దేశాలతో పాటు… దేశంలోన గనులు తవ్వి సొంతగా ఎర్త్‌ మాగ్నెట్‌ ఉత్పత్తి చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. గనులను కేవలం ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలకే కాకుండా ప్రవైట్‌ పెట్టుబడులను ఆకర్షిస్తే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చునని చెబుతున్నారు ఆటో రంగానికి చెందిన నిపుణలు. మరి ఆ దిశగా మోదీ సర్కార్‌ అడుగులు వేస్తుందని ఆశిద్దాం.