Home / ఆంధ్రప్రదేశ్
Sathya Sai Centenary Celebrations: సత్యసాయి శత జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. భేటీలో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, మంత్రులు నారా లోకేశ్, సవిత, సత్యకుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. సత్యసాయి ట్రస్ట్, ప్రభుత్వం సంయుక్తంగా శత జయంతి వేడుకలను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. […]
Prasanna Kumar Reddy Comments: తాను ఎక్కడికీ పారిపోలేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. చేతికి నొప్పి ఉండటంతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వచ్చానని తెలిపారు. కొంతమంది తాను పారిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గురువారం నెల్లూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. నాది నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్లడ్.. భయపడటం తమ బయోడేటాలో లేదన్నారు. తాను నెల్లూరు వదిలి వెళ్లి ఎక్కడో దాక్కున్నట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు కావాలన్నా తనను అరెస్టు […]
AP Govt: ఏపీలో జనగణన చేపట్టేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2027 మార్చి 1వ తేదీ నుంచి ఏపీవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం జీఎడీ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం జారీ చేసిన జనగణన గెజిట్ నోటిఫికేషన్‌ను ఏపీ ప్రభుత్వం తిరిగి ప్రచురించింది. 2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. జనగణన కోసం ఈ ఏడాది జూన్ 16వ తేదీన కేంద్ర హోం శాఖ […]
BJP Telangana State President N.Ramachandra Rao: హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు, బాధితులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు డిమాండ్ చేశారు. కల్తీ కల్లు ఘటనలో అనధికారికంగా ఆరుగురు మృతి చెందారని, ఒకటి రెండు సీసాల కల్లు తాగిన వారి కిడ్నీలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. కల్తీ కల్లులో సైకో ట్రాఫిక్ సబ్ స్టన్స్ కలిపినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఎక్సైజ్ శాఖ కల్లు […]
AP Liquor Scam: ఏపీ లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డిలను సిట్ అరెస్టు చేసింది. రాజకీయ నాయకులు, వారితో సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రమే […]
AP CM Chandrababu Who Became a Teacher: ఆంధ్రప్రదేశ్‌లో మరో రికార్డు సాధనకు రంగం సిద్ధమైంది. ఒకే రోజూ 2 కోట్ల మందితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా పీటీఎం-2.0 ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వవిద్యార్థులు అందరినీ ఒకచోటకు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా […]
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ బాలుడిని ఎక్కించుకొని సైకిల్ తొక్కుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగా వైరల్ అవుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ తొక్కుతున్న సైకిల్‌పై కూర్చున్న బాలుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా.. ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూ విజయనగరం జిల్లాకు చెందిన వాడు. అయితే రాజాపు సిద్ధూ తన తెలివితేటలతో బ్యాటరీతో నడిచే సైకిల్ని తయారు చేశాడు. అదికూడా తక్కువ ఖర్చుతో సరికొత్త ఆవిష్కరణలో తయారు చేశాడు. సుదూరంలో ఉన్న […]
Kurnool District: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద ఇవాళ ఉదయం ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను స్కార్పియో ఢీకొంది. ప్రమాదంలో విహార యాత్రకు వెళ్లి వస్తున్న ముగ్గురు కమల్ భాషా (50), మున్నా (35), షేక్ నదీయా (3) మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన కమల్ […]
Mega Parent Teacher Meeting In AP: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థను బలోపేత చేసే దిశగా ప్రభుత్వం మరో భారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏపీవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.o నిర్వహించనుంది. అయితే ఒకే రోజు దాదాపు 2.28 కోట్లమందిని భాగస్వాములు చేసేందుకు సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్దమయింది. నేడు పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు సీఎం చంద్రబాబు, విద్యా […]
AP CM Chandrababu Key comments on AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఇక రోజులు లెక్కపెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రజాసమస్యలపై స్పందించకున్నా, కార్యకర్త, నాయకులకు గౌరవం ఇవ్వకున్నా మీ స్థానంలో కొత్తవారు వస్తారని మంత్రులకు సూచించారు. ఇక నుంచి మీరు 1995 ముఖ్యమంత్రిని చూస్తారని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. బుధవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో 12 అంశాలపై చర్చించారు. మంత్రులు […]