Published On:

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Three Died in Road Accident Annamaya Dist: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలంలో చెన్నమర్రి మిట్ట సమీపంలో టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లో మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు వారికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన వాసులుగా నిర్ధారించారు. వీరంతా తిరుపతిలోని తిరుమల వేంకటేశ్వరుడిని దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: