England vs India: కెప్టెన్ గిల్ ఊచకోత.. భారీ స్కోరు దిశగా భారత్

England vs India 2nd Test Match: ఇంగ్లాండ్‌తో భారత్ రెండో టెస్ట్ ఆడుతోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(87) పరుగులతో మంచి శుభారంభం అందించగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(114) సెంచరీతో ఊచకోత కోశాడు. ఇక, కేఎల్ రాహుల్(2), కరుణ్ నాయర్(31), రిషబ్ పంత్(25), నితీశ్(1) విఫలమయ్యారు. ప్రస్తుతం జడేజా(41) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. కార్స్, స్టోక్స్, బషీర్ తలో వికెట్ తీశారు.
ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో సెంచరీ చేసిన భారత కెప్టెన్ గిల్ అరుదైన రికార్డు సృష్టించారు. ఇంగ్లాండ్‌లో రెండు సార్లు టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా 13వ ప్లేయర్‌గా నిలిచారు. అయితే రెండు సెంచరీలు ఈ సిరీస్‌లోనే చేయడం విశేషం. అంతకుముందు శుభమన్ గిల్ ఏ దేశంలోనూ తొలిరోజు సెంచరీ చేయలేదు. ప్రస్తుతం గిల్ 114 పరుగులతో క్రీజులో ఉండగా.. జడేజా మంచి సహకారం అందిస్తున్నారు. ఇదే జోరు కొనసాగితే టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.