England Women vs India Women: నేడు ఇంగ్లండ్‌తో ఇండియా మహిళల రెండో టీ20.. జోరు కొనసాగేనా?

England Women vs India Women in 2nd T20 Match: భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్‌తో రెండో టీ 20 మ్యాచ్ ఆడనుంది. బ్రిస్టల్‌లో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది. కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత సెంచరీతో తొలి టీ20లో ఇంగ్లాండ్‌ను భారత్ చిత్తు చేసింది. నేడు జరగనున్న రెండో టీ20లో ఇంగ్లాండ్‌ను ఓడించి 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని చూస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ సైతం ఈ మ్యాచ్ గెలిచి సమం చేయాలని భావిస్తోంది.
ఒకవేళ ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ ఓడితే ఒత్తిడిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిరీస్ కైవసం చేసుకోవాలంటే తర్వాత ఆడే మూడు మ్యాచ్‌లు ఇంగ్లాండ్ గెలవాల్సి ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
జట్టు అంచనా:
ఇండియా మహిళల జట్టు:
స్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జెమీమా, అమన్‌జోత్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, చరణి, హర్మన్‌ప్రీత్ కౌర్.
ఇంగ్లాండ్ మహిళల జట్టు:
సోఫియా డంక్లీ, డేనియల్, బ్రంట్ (కెప్టెన్), టామీ, అమీ జోన్స్ (వికెట్ కీపర్), ఆలిస్ క్యాప్సీ, ఆర్లాట్, సోఫీ ఎకెల్‌స్టోన్, లారెన్ ఫిలర్, స్మిత్, లారెన్ బెల్.